Lemon Juice : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నిమ్మ‌ర‌సం తాగితే.. మీ శ‌రీరం మొత్తం క‌డిగేసిన‌ట్లు శుభ్ర‌మ‌వుతుంది..!

September 22, 2022 3:30 PM

Lemon Juice : నిమ్మ‌కాయ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో ఉప‌యోగిస్తాం. కొంద‌రు దీన్ని అందాన్ని పెంచే సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మానికి కాంతిని ఇవ్వ‌డంతోపాటు, జుట్టుకు వ‌న్నె తెచ్చే గుణాలు నిమ్మ‌ర‌సంలో ఉంటాయి. అయితే ఇవే కాదు, నిమ్మ‌ర‌సంలో విట‌మిన్ సి తోపాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నిమ్మ‌ర‌సం తాగితే దాంతో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది సహజంగా యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నా శరీరంలోకి వెళ్లగానే ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కనుక నిమ్మ రసాన్ని ఎవరైనా నిర్భయంగా సేవించవచ్చు. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. నిమ్మ రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు పలు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనకు రక్షణను ఇస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి.

take Lemon Juice on empty stomach everyday get these benefits
Lemon Juice

వయస్సు మీద పడుతుండడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఆ లక్షణాలను దూరం చేసే యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తద్వారా కలిగే ఇతర అనారోగ్య లక్షణాలు కూడా దూరమవుతాయి. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.

పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కణాల వృద్ధి ఆగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. మ‌న శరీరం ఐరన్‌ను గ్రహించేందుకు నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి తోడ్పడుతుంది. దీంతో రక్తహీనత వంటి జబ్బులు తగ్గుతాయి. మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే యాంటీ ఏజింగ్ లక్షణాలు నిమ్మ రసంలో ఉన్నాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే దాంతోపాటు చర్మ కాంతిని పెంచే ఔషధ గుణాలు కూడా నిమ్మరసంలో ఉన్నాయి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం పోతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మాయమవుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నిమ్మరసం తాగాల్సిందే. దీంతోపాటు కిడ్నీల్లో ఉండే రాళ్లు కూడా కరిగిపోతాయి. కిడ్నీల్లో క్యాల్షియం గడ్డకట్టదు. తద్వారా రాళ్లు ఏర్పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. నిమ్మరసంలో పాస్ఫరస్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. క‌నుక నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment