Tabu : తెలుగు ప్రేక్షకులకు టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈమె తెలుగులో చాలా పాపులర్ హీరోయిన్‌గా ఉండేది. ఈమెతో సినిమాలు చేసేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించేవారు. అక్కినేని నాగార్జున టబుతో అధికంగా సినిమాలు చేశారు. అయితే ఇప్పటికీ ఈమెకు పెళ్లి కాలేదు. వయస్సేమో 50 ఏళ్లు. అయినప్పటికీ ఈమె జోరు ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో టబును తమ సినిమాల్లో నటింపజేసేందుకు మేకర్స్ ఆమెకు భారీగానే ముట్టజెబుతున్నారట. ఆమె అడిగినంత ఇస్తున్నారట.
టబు ఈమధ్యే నటించిన భూల్ భులయ్యా 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేసింది. అయితే హీరో కార్తీక్ ఆర్యన్ అయినప్పటికీ అతని పాత్రకు పెద్దగా విలువ లేదు. సినిమా మొత్తం మనకు టబునే కనిపిస్తుంది. అందువల్ల ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పవచ్చు. ఇక తన సినిమాలు వరుస హిట్స్ అవుతుండడంతో టబు తన రెమ్యునరేషన్‌ను కూడా అమాంతం పెంచేసిందట. ఇప్పటి వరకు ఆమె సినిమాకు రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.4 కోట్లు కావాలని అడుగుతుందట. అయినప్పటికీ ఆమెకు అడిగినంత ఇచ్చి ఆమెతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారట. ఈ క్రమంలోనే 50 ఏళ్ల వయస్సులోనూ టబు జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి.
కాగా టబు 2 ఏళ్ల కిందట అల వైకుంఠపురములో మూవీలో నటించింది. అల్లు అర్జున్‌కు తల్లిగా చేసిన ఈమె అప్పట్లోనే 15 నిమిషాల తన రోల్‌కు గాను రూ.3 కోట్లు తీసుకుందని సమాచారం. ఆ తరువాత ఈమె తెలుగులో ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే కెరీర్ దాదాపుగా ముగింపు దశలో ఉన్న టబుకు ఇలా భారీ రెమ్యునరేషన్‌తో ఆఫర్లు వస్తుండడం నిజంగానే షాక్‌ను కలిగిస్తుందని చెప్పవచ్చు. మరి ఈమె గ్రాఫ్ ఇకపై ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాలి.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…