Arunachalam Movie : ర‌జనీ సినిమాలోలాగా 30 రోజుల్లో రూ.30 కోట్ల‌ను.. ఇలాగైతే సుల‌భంగా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు..!

Arunachalam Movie : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి అరుణాచ‌లం. 1997వ సంవ‌త్స‌రంలో రిలీజ్ అయిన మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ మూవీ ర‌జ‌నీ కెరీర్ హిట్స్‌లో ఒక‌టిగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా క‌థ చాలా మందికి న‌చ్చింది. నెల రోజుల్లో రూ.30 కోట్ల‌ను ఖ‌ర్చు పెడితే రూ.3000 కోట్ల ఆస్తి వ‌స్తుంద‌నే క‌థ‌తో సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. చివ‌ర‌కు హీరో ఎలాగో క‌ష్ట‌ప‌డి ఆ విధంగా చేస్తాడు. దీంతో రూ.3000 కోట్ల ఆస్తి వ‌స్తుంది. అయితే దాన్నంతా ట్ర‌స్ట్‌కే ఇచ్చేసి అరుణాచ‌లం తిరిగి సొంత ఊరికి వెళ్లిపోతాడు. ఈ విధంగా సినిమా క‌థ ముగుస్తుంది.

అయితే 30 రోజుల్లో రూ.30 కోట్ల‌ను ఖ‌ర్చు పెట్ట‌డం ఆకాలంలో చాలా క‌ష్ట‌మే. కానీ ఇప్పుడు అది ఎంతో సుల‌భం అనే చెప్ప‌వ‌చ్చు. అవును.. 30 రోజుల్లో రూ.30 కోట్ల‌ను ఖ‌ర్చు పెట్టాల‌ని ఎవ‌రైనా కండిష‌న్ పెడితే గ‌న‌క దాన్ని సులభంగా సాధించ‌వ‌చ్చు. రూ.30 కోట్ల‌ను మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. అందుకుగాను ఎలాంటి జూదం ఆడాల్సిన ప‌నిలేదు. రాజ‌కీయాల్లోకి వెళ్లాల్సిన‌, సినిమాలు తీయాల్సిన ప‌ని అస‌లే లేదు. మ‌రి రూ.30 కోట్ల‌ను 30 రోజుల్లో ఎలా ఖ‌ర్చు చేయాలి.. అందుకు ఏం చేయాలి.. అంటే..

Arunachalam Movie

వెస్టిండీస్‌లోని సెయింట్ లూసియా అనే ప్రాంతం వ‌ద్ద ఉన్న క‌రేబియ‌న్ స‌ముద్రంలో ఓ కంపెనీ స‌బ్‌మెరైన్ హోట‌ల్స్ ను నిర్వ‌హిస్తోంది. ల‌వ‌ర్స్ డీప్ పేరిట వీటిని న‌డుపుతున్నారు. అయితే పేరు ఇది స‌బ్‌మెరైన్. కానీ మొత్తం ఓపెన్ ఉంటుంది. స‌బ్ మెరైన్ గ్లాస్ రూపంలో ఉంటుంది. అందువ‌ల్ల అందులో ఉంటే స‌ముద్రంలో ప్ర‌యాణించేట‌ప్పుడు మ‌న చుట్టూ ఉండే జీవ‌రాశుల‌ను చూడ‌వ‌చ్చు. స‌ముద్రంలో అలా గ్లాస్ స‌బ్‌మెరైన్‌లో విహ‌రిస్తుంటే వ‌చ్చే మ‌జాయే వేరు. అయితే ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం.

ఇలా స‌బ్ మెరైన్ లో ప్ర‌యాణించాలంటే రోజుకు 2.92 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను వ‌సూలు చేస్తారు. అంటే మ‌న క‌రెన్సీలో సుమారుగా రూ.2.24 కోట్లు అన్న‌మాట‌. అంటే ఇందులో దాదాపుగా రెండు వారాల పాటు.. అంటే 14 రోజులు ఉంటే చాలు.. రూ.30 కోట్లు అవుతాయి. ఇలా రూ.30 కోట్ల‌ను సుల‌భంగా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. అందులోనూ ఇచ్చిన గ‌డువులో స‌గం రోజుల్లోనే ప‌ని పూర్తి చేయ‌వ‌చ్చు. దీంతో పందెంలో సుల‌భంగా గెలుస్తారు. నిజంగానే రూ.30 కోట్ల‌ను 30 రోజుల్లో ఖ‌ర్చు చేయాల‌ని ఎవ‌రైనా కండిష‌న్ పెడితే సుల‌భంగా దాన్ని ఈ హోట‌ల్‌లో ఉండ‌డం ద్వారా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. అయిత అలా సినిమాల్లోనే జ‌రుగుతుంటుంది. నిజ జీవితంలో జ‌ర‌గ‌దు.

ఇక ఈ స‌బ్‌మెరైన్ హోట‌ల్‌లో మ‌నం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండ‌వ‌చ్చు. ఒక ప్ర‌త్యేక గ‌దిని, వంట మ‌నిషిని కేటాయిస్తారు. రూమ్ స‌ర్వీస్ ఉంటుంది. అందులో ఎన్ని రోజులంటే అన్ని రోజులు గ‌డ‌ప‌వ‌చ్చు. కానీ రోజుకు మాత్రం రూ.2.24 కోట్లు ఇవ్వాలి. ఊహించుకుంటేనే క‌ళ్లు బైర్లు కమ్ముతున్నాయి క‌దా.. ఇక అందులో సామాన్యుల‌కు ఎంట్రీ ఎలా ఉంటుంది చెప్పండి.. కేవ‌లం సంప‌న్నులు మాత్ర‌మే అందులోకి వెళ్ల‌గ‌ల‌రు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM

విజయ్ ‘జన నాయకన్’ వివాదానికి చెక్..? కోర్టు బయటే రాజీ..? రిలీజ్‌పై తాజా అప్‌డేట్!

తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…

Thursday, 29 January 2026, 12:36 PM