Surekha Vani : సురేఖా వాణిపై దారుణమైన కామెంట్స్‌.. ఈ వయస్సులో మీకిది అవసరమా.. అని ట్రోల్స్..!

May 30, 2022 8:41 PM

Surekha Vani : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో రాణిస్తున్న సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు సినిమాల్లో ఎంతో బిజీగా ఉంటూనే మరో వైపు తన కుమార్తె సుప్రీతతో కలిసి టూర్లకు వెళ్తోంది. అలాగే ఇద్దరూ సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరు పలు పాటలకు డ్యాన్స్‌లు చేసి ఇప్పటికే ఎంతో అలరించారు. వీరి డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తుంటాయి. అయితే వీరిపై ఎప్పటికప్పుడు నెటిజన్లు ట్రోల్‌ చేస్తూనే ఉంటారు. వారు పెట్టే పోస్టులపై కామెంట్స్‌ చేస్తూనే ఉంటారు. ఇక తాజాగా మరోమారు సురేఖా వాణిపై ట్రోల్స్‌, విమర్శలు వస్తున్నాయి.

సురేఖా వాణి లేటెస్ట్‌గా ఓ అద్భుతమైన ట్రెండీ డ్రెస్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ క్రమంలోనే తెలుసా తెలుసా ప్రేమించానని అనే పాట బ్యాక్‌ గ్రౌండ్‌లో వస్తుండగా.. ఈమె ఆ పాటకు పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. అనంతరం ఆ వీడియోను పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. అయితే చాలా బాగుందని చాలా మంది కామెంట్లు చేస్తుండగా.. కొందరు మాత్రం సురేఖా వాణిని విమర్శిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

Surekha Vani latest video netizen troll her
Surekha Vani

సురేఖా వాణిని కొందరు నెటిజన్లు ఆంటీ అంటూ ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. సురేఖ మేడమ్‌.. మీ అమ్మాయి పెళ్లి అయ్యే వరకు మీరు ఇలాంటివి కాస్త తగ్గించుకుంటే మంచిది.. లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చేవాడు ఏకంగా మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాడు.. అని సురేఖా వాణిపై దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం.. ఈ వయస్సులో మీకు ఈ సాంగ్‌ అవసరమా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరు మాత్రం తల్లీ కూతుళ్లు ఇద్దరూ అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఉన్నారని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి పోస్ట్‌ వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now