Sri Reddy : పుల‌స చేప‌ల‌తో కూర వండిన శ్రీ‌రెడ్డి.. చూస్తుంటేనే నోరూరిపోతుందిగా..

September 16, 2022 12:04 PM

Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం ద్వారా టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన న‌టి.. శ్రీ‌రెడ్డి. ఆ త‌రువాత ఈమె పెద్ద‌గా సంద‌డి చేయ‌లేదు. ఆమె అప్ప‌ట్లో ప‌వన్‌పై చేసిన కామెంట్ల వ‌ల్ల టాలీవుడ్‌కు శాశ్వ‌తంగా దూర‌మైంది. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఉంటే త‌న‌కు ముప్పు ఉంటుంద‌ని భావించిన ఈమె చెన్నైకి మ‌కాం మార్చింది. అప్ప‌టి నుంచి అక్క‌డే ఉంటూ సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫ్యాన్స్‌కు ట‌చ్‌లో ఉంటూ వ‌స్తోంది శ్రీ‌రెడ్డి. అయితే ఈ మ‌ధ్య కాలంలో శ్రీ‌రెడ్డి యూట్యూబ్‌లో అనేక వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తూ అల‌రిస్తోంది.

ఇప్ప‌టికే శ్రీ‌రెడ్డి చికెన్‌, మ‌ట‌న్‌, రొయ్య‌లు, పీత‌లు.. వంటి ఎన్నో వెరైటీ వంట‌కాల‌ను చేసింది. ఆ వంట‌కాల‌ను వండేట‌ప్పుడు ఈమె త‌న‌దైన శైలిలో పంచులు వేస్తుంటుంది. అలాగే స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తుంటుంది. ఇక గ‌తంలో నాగ‌బాబు కుమార్తె నిహారిక డ్ర‌గ్స్ కేసులో అరెస్టు అయిన‌ప్పుడు శ్రీ‌రెడ్డి వారిపై ఘాటు విమర్శ‌లు చేసింది. ఆ త‌రువాత విష‌యాల‌పై ఈమె పెద్ద‌గా స్పందించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం శ్రీ‌రెడ్డి యాక్టివ్‌గానే ఉంటోంది.

Sri Reddy cooked pulasa fish curry video viral
Sri Reddy

కాగా శ్రీ‌రెడ్డి లేటెస్ట్‌గా పుల‌స చేప‌ల కూర వండింది. తాను కిలో రూ.10వేలు పెట్టి చేప‌ల‌ను కొన్నానని తెలియ‌జేసింది. అంతేకాదు.. చేప‌ల‌ను ఎలా వండాలో కూడా చెప్పింది. పుల‌స చేప‌ల‌ను వండే శైలి గురించి వివ‌రించింది. ఇక శ్రీ‌రెడ్డి ప్ర‌స్తుతం సినిమాలు ఏమీ చేయ‌డం లేదు.. కానీ త‌మిళ మీడియాలో మాత్రం సంద‌డి చేస్తోంది. త‌న‌కు త‌మిళ్ బాగా తెలుసు. అందువ‌ల్లే ఆమె చెన్నైలో సెటిల్ అయింది. ఇక శ్రీ‌రెడ్డి లేటెస్ట్‌గా షేర్ చేసిన పుల‌స చేప‌ల కూర వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now