Sri Reddy : కిలోల కొద్దీ బంగారం కొనేసిన శ్రీ‌రెడ్డి.. మామూలుగా లేదు..!

June 29, 2022 9:55 PM

Sri Reddy : శ్రీ‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది క‌నుక అందులో యాక్టివ్‌గా ఉండే అంద‌రికీ ఈమె గురించి కచ్చితంగా తెలుస్తుంది. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈమె న‌టిగా కంటే వివాదాల‌తోనే ఎక్కువ పాపుల‌ర్ అయింది. ఏదో ఒక సామాజిక అంశంపై ఈమె పెట్టే పోస్టులు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే శ్రీ‌రెడ్డికి సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ‌గానే ఉంది. క‌నుక‌నే ఆమె ఏ పోస్టు పెట్టినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటుంది. ఇక శ్రీ‌రెడ్డి ఈమధ్య కాలంలో త‌న యూట్యూబ్ చాన‌ల్‌ను పాపుల‌ర్ చేయ‌డంలో బిజీగా మారింది. ఇప్ప‌టికే అందులో ప‌లు వంటల వీడియోల‌ను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఈమె రూటు మార్చింది. ఈమధ్య రెస్టారెంట్ల‌కు వెళ్లి ఫుడ్ తింటూ ఆ రెస్టారెంట్‌ల‌కు రేటింగ్ ఇస్తోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా ఈమె రెండు రెస్టారెంట్ల‌కు వెళ్లి అక్క‌డి ఫుడ్స్‌ను రుచి చూసి రివ్యూల‌ను ఇచ్చేసింది.

ఇక శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండ‌డం లేదు. యూట్యూబ్ చాన‌ల్‌లో వంట‌ల వీడియోల ద్వారా ఈమె పిచ్చెక్కిస్తోంది. చికెన్‌, మ‌ట‌న్‌, పీతలు, చేప‌లు వంటి వివిధ ర‌కాల నాన్‌వెజ్ ఐట‌మ్స్‌ను వండిన ఈమె ఆ వీడియోల‌ను పోస్ట్ చేయ‌గా.. అవి వైర‌ల్ అయ్యాయి. అయితే శ్రీ‌రెడ్డి ఇప్పుడు వంట‌లు కాదు కానీ బంగారం కొన‌డంలో బిజీ అయింది. ఆమె ఓ న‌గ‌ల షాపుకు వెళ్లిన‌ట్లు తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోలో చెప్పింది. అయితే న‌గ‌ల షాపుకు వెళ్లిన త‌రువాత త‌న‌తో బంగారం అంతా కొనిపించేశార‌ని థంబ్ నెయిల్ పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆమె లేటెస్ట్ యూట్యూబ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sri Reddy bought kilos of gold
Sri Reddy

శ్రీ‌రెడ్డి గ‌తంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని రేకెత్తించిన విష‌యం విదిత‌మే. ఈమె ఫిలిం చాంబ‌ర్ ఎదుట అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసి జాతీయ వార్తల్లోకి ఎక్కింది. దీంతో దెబ్బ‌కు సినీ పెద్ద‌లు దిగి వ‌చ్చి ఆమెకు మా మెంబ‌ర్‌షిప్ ఇస్తామ‌ని చెప్పారు. అయితే ఆర్‌జీవీ సూచ‌న మేర‌కు ఆమె ప‌వ‌న్‌ను దూషించింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఆమెపై క‌నిపిస్తే దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఇదే విష‌య‌మో.. మ‌రొక‌టో తెలియ‌దు కానీ.. ఈమె ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ను వదిలి చెన్నైలో ఉంటూ యూట్యూబ్ వీడియోల‌ను చేసుకుని జీవ‌నం సాగిస్తోంది.

https://youtu.be/O3uvQfekwJk

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now