---Advertisement---

Sri Reddy : ఇప్ప‌టికీ మీతోనే ఉన్నా.. అంటున్న శ్రీ‌రెడ్డి.. ఎవరి గురించి..?

May 15, 2022 9:47 AM
---Advertisement---

Sri Reddy : శ్రీ‌రెడ్డి న‌టిగా కంటే వివాదాల వ‌ల్లే ఎక్కువ ఫేమ‌స్ అయిన విష‌యం విదిత‌మే. ఈమె ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అవి వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే శ్రీ‌రెడ్డి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ప్ర‌స్తుతం త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ప‌లు వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తూ కాలం గ‌డుపుతోంది. ఇక ఇటీవ‌లే మెగా డాట‌ర్ నిహారిక డ్ర‌గ్స్ కేసు విష‌యంలో శ్రీ‌రెడ్డి.. నాగ‌బాబును క‌డిగి పారేసింది. నాగ‌బాబు తెల్లారి లేస్తే నీతులు చెబుతార‌ని.. కానీ సొంత కుమార్తెను స‌రిగ్గా పెంచ‌లేద‌ని ఫైర్ అయింది. ఇక శ్రీ‌రెడ్డి స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌పై కూడా స్పందిస్తుంటుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అంత ఎత్తున లేచి ప‌డే శ్రీ‌రెడ్డి రాజ‌కీయాల ప‌రంగా సీఎం జ‌గ‌న్‌ను అభిమానిస్తుంది. గ‌తంలోనే ఈ విష‌యం గురించి ఆమె ప‌లు మార్లు చెప్పింది. త‌న‌కు వైఎస్సార్ అంటే ఇష్ట‌మ‌ని.. ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం కృషి చేస్తున్న సీఎం జ‌గ‌న్ అంటే ఇంకా ఇష్ట‌మ‌ని శ్రీ‌రెడ్డి తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన‌ధికారికంగా మ‌ద్ద‌తు ఇస్తుంటుంది. ఆ పార్టీకి చెందిన నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు త‌న స‌పోర్ట్ తెలుపుతుంటుంది. మ‌రోవైపు వైసీపీని టార్గెట్ చేసే వారిపై కామెంట్లు కూడా చేస్తుంటుంది. అయితే శ్రీ‌రెడ్డి తాజాగా సీఎం జ‌గ‌న్‌కు చెందిన ఓ పాత ఫొటోను షేర్ చేసింది.

Sri Reddy shared CM YS Jagan photo put a caption
Sri Reddy

శ్రీ‌రెడ్డి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు చెందిన ఒక పాత ఫొటోను షేర్ చేసింది. దానికి కాప్ష‌న్ కూడా పెట్టింది. స్టిల్ విత్ యు అన్నా.. అంటే.. ఇప్ప‌టికీ మీతోనే ఉన్నా అన్నా.. అని కాప్ష‌న్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

అయితే శ్రీ‌రెడ్డి వైకాపాకు మ‌ద్ద‌తుగానే ఉంటుంది. అది మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. కానీ ఆమె ఇంత స‌డెన్‌గా ఎందుకు ఆ పోస్ట్ పెట్టింది.. అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. ఇక శ్రీ‌రెడ్డి పెట్టిన ఈ పోస్టుకు నెటిజ‌న్లు కూడా స్పందిస్తున్నారు. వైఎస్సార్ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now