Sindhu Tolani : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన సింధు తులాని.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

November 19, 2022 6:13 PM

Sindhu Tolani : చూడ చక్కని రూపం, అందమైన చిరునవ్వుతో అప్పటిలో ఎంతోమంది మనసు దోచుకుంది సింధు తులాని. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఐతే అనే తెలుగు సినిమాతో సింధు తులాని తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో ఆమె మొదటి పాపులర్ సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే మూవీతోనే. తన అందం, అభినయంతో అతనొక్కడే చిత్రం ద్వారా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించింది సింధుతులాని. సింధు తులాని గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక థియేటర్ కోర్సు పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకుంది సింధు. కెరియర్ బిగినింగ్ లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడల్ గా వ్యవహరిచింది. బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ షమితా శెట్టి ఫ్రెండ్ గా కూడా నటించింది. ఐతే చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

Sindhu Tolani do you know how she is now
Sindhu Tolani

సింధు తులాని జూలై 19, 1983 న భారతదేశంలోని ముంబైలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగులే. తండ్రి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్నారు. సింబు హీరోగా నటించిన మన్మథ చిత్రం చేసి కోలీవుడ్ లో కూడా పాగా వేసింది. పోతేపోనీ, బతుకమ్మ వంటి చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసి అవార్డులు కూడా అందుకుంది. సినీమాలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి ఏడాది పాటు సినిమాలకు దూరమైంది.  సింధుతులాని భర్త ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దదరి దంపతులకు శ్వేత అనే కుమార్తె ఉంది.

సింధుతులాని స్పెషాలిటీ ఏంటంటే చాలామంది హీరోయిన్స్ పెళ్లయిన తర్వాత మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఆమె మాత్రం పెళ్లయిన ఏడాదికే మళ్లీ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. తనకు హీరోయిన్ పాత్రలే కావాలని డిమాండ్ చేయకుండా, కథకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ లో సినిమాల్లో నటిస్తుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ప్రవేశించి సోనీ టీవీలో కుటుంబ్ అనే టీవీ సీరియల్ లో కూడా నటించింది. అంతేకాకుండా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నేట్రు, ఇండ్రు, నాలై అనే నాటకాల్లోనూ నటించి తన నటన ప్రతిభను చాటుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment