Simbu : కోలీవుడ్ హీరో శింబు తమిళ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. మూవీ విశేషాలను పంచుకుంటూనే ఒక్కసారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు.
శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చారు. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్లను ప్రస్తావించకుండానే శింబు అన్నారు. “నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ శింబు తన అభిమానులను కోరాడు.
వెంకట్ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నాడు. ‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదువ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు. కాగా, గత దశాబ్ద కాలంగా శింబు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కొంటున్నాడు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…