Shweta Tiwari : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. బాలీవుడ్‌లో అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా నటి శ్వేత తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలపై ఓ వర్గం వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్వేత తివారీ.. హమ్ తుమ్ అండ్ దెమ్.. మేరీ డాడ్‌కీ దుల్హన్ సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో చివరకు పోలీస్ కేస్ వరకు విషయం వెళ్లింది.
శ్వేత తివారీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆమె కొంప ముంచాయి. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ షో స్టాపర్ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేవుడిని ఉద్దేశించి అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసింది.
ప్రెస్ మీట్‌లో భాగంగా శ్వేత తివారీ మాట్లాడుతూ.. దేవుడు తన బ్రా కొలతలు తీసుకుంటున్నాడని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై అందరూ మండిపడుతున్నారు. దేవుడిపై ఇలా అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయొచ్చా.. అని ప్రశ్నిస్తున్నారు.
అయితే శ్వేత తివారీ తరువాత తన వ్యాఖ్యలకు సారీ చెప్పింది. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆమె వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె మాట్లాడిన మాటలకు చెందిన వీడియో కూడా వైరల్ అయింది. దీంతో ఆమెకు గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా మారింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…