Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ జోష్ లో ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేశారు. రూ.199 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో ఈ మూవీని ప్రేక్షకులు వీక్షించవచ్చు.
ఇక సర్కారు వారి పాట అనంతరం కొద్ది రోజుల పాటు విరామంలో ఉన్న మహేష్ మళ్లీ తన తదుపరి సినిమా చేయనున్నారు. ఆయన త్రివిక్రమ్‌తో కలిసి త్వరలో ఓ మూవీని చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే పూజా హెగ్డెను ఎంపిక చేశారు. పూజా గతంలో మహేష్ తో మహర్షి సినిమా చేయగా.. అది హిట్ అయింది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె అరవింద సమేత, అల వైకుంఠ పురములో సినిమాలను చేసింది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ మళ్లీ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తో ఈ ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి రాజమౌళి సినిమాను చేయవచ్చని ఆయన ప్లాన్. అదేవిధంగా ఆయన షెడ్యూల్‌ను కూడా పూర్తి చేయనున్నారని సమాచారం.
అయితే రాజమౌళితో కలసి చేయబోయే సినిమాకు గాను ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే కథ గురించి ఒక హింట్ ఇచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్ జోనర్‌లలో ఈ మూవీ తెరకెక్కుతుందని అన్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఈ మూవీ 2023 ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. ఇందులో హీరోయిన్‌ను అయితే ఇంకా ఎంపిక చేయలేదు. కానీ సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను మహేష్ కు జోడీగా ఎంపిక చేయాలని చూస్తున్నారట. అయితే ఈ విషయంపై మహేష్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఆమె సాహోలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కనుక ఆమె హీరోయిన్‌గా వద్దే వద్దు.. అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారట. అయితే ఫ్యాన్స్ విజ్ఞప్తిని జక్కన్న పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…