Allu Arjun : వామ్మో.. బన్నీకి బహిరంగంగా ప్రపోజ్ చేస్తూ హగ్ చేసుకున్న అమ్మాయి..!

November 1, 2021 3:21 PM

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంతమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా నటీనటులు కూడా ఆయనకు అభిమానులుగా ఉన్నారు. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలోనూ వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శాన్వి మేఘన మొట్టమొదటిసారిగా హీరోయిన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

shanvi meghana hugged Allu Arjun  and proposed to him

ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ, శాన్వి మేఘన జంటగా తెరకెక్కిన చిత్రం “పుష్పకవిమానం”. ఈ సినిమా నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానం ఉన్న శాన్వి మేఘన స్టేజిపై అల్లు అర్జున్ గురించి మాట్లాడింది. అల్లు అర్జున్ కి తాను పెద్ద ఫ్యాన్ అంటూ అందరి ముందే బన్నీకి ప్రపోజ్ చేయడమే కాకుండా ఆయనను హగ్ చేసుకొని ఎంతో మురిసిపోయింది. ఇలా అందరి ముందు బన్నీని హగ్ చేసుకొని తనకు ప్రపోజ్‌ చేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పకవిమానం చిత్రాన్ని స్వయంగా తన అన్న విజయ్ దేవరకొండ నిర్మించడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now