గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shakeela : ఆ షాట్ చూసి మా నాన్న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింది: ష‌కీలా

Shakeela : శృంగార తార షకీలా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆమెకి ఉన్న పాపులారిటీ సినిమా హీరోల‌కు కూడా ఉండేది కాదు. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు.…

Shakeela : ఆ షాట్ చూసి మా నాన్న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింది: ష‌కీలా

Shakeela : శృంగార తార షకీలా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆమెకి ఉన్న పాపులారిటీ సినిమా హీరోల‌కు కూడా ఉండేది కాదు. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంత‌లా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకున్నారు.

Shakeela remembered a scene where her father got heart attack

వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ష‌కీలా ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘క్యాష్‌’ గేమ్‌ షోలో సందడి చేశారు. జ్యోతి, సంపూర్ణేశ్‌ బాబు, అభినయశ్రీలతో కలిసి గేమ్ పాల్గొన్న ష‌కీలా త‌న గ‌తాన్ని గుర్తు చేసుకుంది.

తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ”మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నా కష్టాలను ఆయన దగ్గరుండి చూశారు. ఓ సినిమా షూట్‌కు నాన్న నాతోపాటు సెట్‌కి వచ్చారు. ఓ షాట్‌లో నేను భ‌వ‌నంపై నుండి దూకాలి. డూప్స్ లేక‌పోవ‌డంతో నేను అలానే దూకేశాను. కాలు విరిగింది. అది చూసి మా నాన్న‌కు గుండెపోటు వ‌చ్చింది. అలాంటి యాక్షన్‌ తరహా సన్నివేశాలు చేయవద్దని నాన్న చెప్పారు.. అంటూ ష‌కీలా క‌న్నీరు పెట్టుకుంది. మిగ‌తా కంటెస్టెంట్స్ న‌వ్వులు పూయించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి