Satya Dev Godse Movie Review : వైవిధ్య భరితమైన చిత్రాలలో భిన్నమైన క్యారెక్టర్లలో నటించడంలో నటుడు సత్యదేవ్‌కు ఎంతో పేరుంది. ఈయన చిన్న బడ్జెట్ సినిమాలు తీసి హిట్స్ కొడుతూనే మరోవైపు ఇతర హీరోలకు చెందిన చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈయన హీరోగా లేటెస్ట్‌గా వచ్చిన చిత్రం.. గాడ్సె. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉందని ఇప్పటికే టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా శుక్రవారం (జూన్ 17) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒక లుక్కేద్దాం.
కథ..
ఉన్నట్లుండి సడెన్ గా మంత్రుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఒకరి వెంట మరొకరు కిడ్నాప్‌లకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే ఆ కిడ్నాప్‌లను చేస్తోంది గాడ్సె అని తెలుస్తుంది. దీంతో ఈ కేసును ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వైష్ణవి (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ క్రమంలో ఆమె కిడ్నాపర్ గురించి అసలు విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అతనితో కాంటాక్ట్ అవుతూ అతని డిమాండ్స్ ఏమిటో చెప్పాలని అడుగుతుంది. అయితే చివరకు ఏం జరుగుతుంది ? అసలు గాడ్సె ఎవరు ? అతను మంత్రులను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? అతన్ని వైష్ణవి అరెస్టు చేస్తుందా ? అసలు ఏమవుతుంది ? వంటి వివరాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఈ మూవీలో గాడ్సెగా సత్యదేవ్ అన్నీ తానే అయి సినిమాను ముందుండి నడిపించాడు. అందువల్ల ప్రతి సీన్‌లోనూ ఆయనే కనిపిస్తాడు. ఇక ఐశ్వర్య లక్ష్మి కూడా తన పాత్రలో బాగానే నటించిందని చెప్పవచ్చు. అయితే రొటీన్ స్టోరీ కావడం, మిగిలిన నటీనటులను బాగా వాడుకోకపోవడం, సినిమాలో తరువాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించగలగడం.. బోరింగ్ సెకండాఫ్ వంటివి సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. అయితే ఓవరాల్‌గా చెప్పాలంటే కాస్త భిన్నమైన సినిమాను చూడదలిస్తే.. ఈ మూవీకి వెళ్లవచ్చు. లేదంటే వెళ్లకపోవడమే మంచిది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…