Samantha : క్రేజీ క‌పుల్‌కి శుభాకాంక్షలు తెలిపిన సమంత.. ఎందుకో తెలుసా?

October 25, 2021 1:35 PM

Samantha : సినీ ఇండస్ట్రీలో నటీనటులకు, దర్శక నిర్మాతలకు అత్యంత గౌరవమైన పురస్కారం ఆస్కార్. అలాంటి ఆస్కార్ నామినేషన్‌కు నయనతార, విఘ్నేష్ శివన్ ల సినిమా ఎంపికయ్యింది. కూళంగల్ అనే సినిమాను నయనతార, విఘ్నేష్ శివన్ లు నిర్మించారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు ఇండియా తరఫు నుండి వెళ్ళడంతో సెలెబ్రిటీలంతా వారికి శుభాకాంక్షలు తెలిపారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ లకు సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.

Samantha told wishes to nayanthara and vignesh

అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నయనతార ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమాకు తన కాబోయే భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వహించారు. రీసెంట్ గా ఈ సినిమా ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ సినిమాల కేటగిరిలో ఇండియా నుండి సెలెక్ట్ అయ్యింది. అలాగే నయన్ కు బాలీవుడ్ సినీ హీరో విక్కీ కౌశల్ కూడా విష్ చేశారు. ఆయన నటించిన సర్దార్ ఉద్దమ్ తో పాటు కుళాంగల్ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్‌ కు సెలెక్ట్ అవ్వడం విశేషం అంటూ పొగిడారు.

ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించినందుకు నయన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకుంది. వచ్చే సంవత్సరం 2022 మార్చి 22 న 94 వ అకాడమీ అవార్డ్స్ ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ వేడుకలను అమెరికా లాస్ ఏంజిల్స్ లో డాల్బి థియేటర్ లో సెలెబ్రేట్ చేస్తారు. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment