Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత ఎంతో మారిపోయిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె గ్లామర్ షో చేస్తోంది. అందాల ఆరబోతే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ నెలకు రూ.3 కోట్ల వరకు సంపాదిస్తోంది. అయితే నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత కొంత కాలం పాటు సమంత మామ్స్ సెయిడ్ పేరిట పలు కొటేషన్స్‌ను షేర్ చేసింది. కానీ ఏమైందో తెలియదు. కొంత కాలం నుంచి కొటేషన్స్‌ను షేర్ చేయడం లేదు.
కొంత కాలం నుంచి సమంత కొటేషన్స్‌ను షేర్ చేయకపోగా.. తన అప్‌డేట్స్ గురించే ఎక్కువగా పోస్ట్‌లు పెడుతోంది. అయితే ఉన్నట్లుండి సడెన్‌గా కొటేషన్స్‌ను పెట్టాలనిపించింది కాబోలు.. వెంటనే మళ్లీ ఓ కొటేషన్‌ను పెట్టింది. మనం ఎదుటి వారిలో మంచితనాన్ని ఎందుకు చూస్తామంటే.. మనలో కూడా మంచితనం ఉంటుంది కాబట్టి.. అనే కొటేషన్‌ను షేర్ చేసింది. అయితే ఈ కొటేషన్ ద్వారా సమంత పరోక్షంగా తనను తాను మంచిదాన్నని చెప్పుకుంటుందని తెలుస్తోంది.
సాధారణంగా మనం చెడ్డ వాళ్లం అయితే ఎదుటి వారిలోనూ చెడ్డ లక్షణాలను వెదుకుతాం. అదే మనం మంచి వాళ్లం అయితే ఎదుటి వారిలో కూడా మంచినే చూస్తాం. అంటే సమంత ఎదుటి వారిలో మంచినే చూస్తానని చెబుతోంది. దానర్థం తాను మంచిది అన్నట్లే కదా. ఇలా సమంత తనను తాను మంచిదాన్నని పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో ఆమెపై ఎక్కడ చూసినా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కనుకనే ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టిందా.. అని చర్చించుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే మూవీలో నటిస్తుండగా.. యశోద అనే సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. ఈ రెండు మూవీలు కూడా త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…