Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత తన పనేదో తాను చేసుకుంటోంది. అప్పట్లో కొంతకాలం పాటు ఇన్‌డైరెక్ట్ గా చైతన్య మీద సెటైర్ వేస్తున్నట్లు ఈమె కొన్ని సందేశాలను పోస్ట్ చేసింది. తరువాత వాటిని తగ్గించింది. కానీ తన అప్‌డేట్స్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. తాను ఏం చేస్తున్నది.. ఏ సినిమాల్లో నటిస్తున్నది.. వెకేషన్‌కు వెళితే ఆ వివరాలు.. ఇలా అన్నింటినీ సమంత తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. కానీ ఇన్ని నెలల్లో ఎప్పుడ కూడా తన విడాకులపై నోరు విప్పలేదు.
టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య మోస్ట్ క్యూట్ కపుల్‌గా ఉన్నారు. కానీ వీరు విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికి వారు తమకు తోచిన కారణాలను చెబుతున్నారు కానీ.. అసలు విడాకులకు దారి తీసేంత మ్యాటర్ వీరి మధ్య ఏం జరిగి ఉంటుంది ? అని ఇప్పటికీ ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే ఈ మాట అటుంచితే దీనిపై సమంత ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కానీ ఎట్టకేలకు ఈమె ఈ విషయంపై నోరు విప్పక తప్పదని అంటున్నారు. ఎందుకంటే.. ఈమె ఓ షోలో పాల్గొనబోతుంది కాబట్టి. అందులో ప్రశ్నలు అడిగే అతను మామూలు వ్యక్తి కాదు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత. ఇప్పటికీ ఎంతో మందిని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బందులు పెట్టాడు. దీంతో సమంతను కూడా అలాగే అతను అడగబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరంటే..
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంటే తెలియని వారుండరు. సౌత్ సినిమాలను ఎక్కువగా బాలీవుడ్‌లో ప్రదర్శించేలా హక్కులను తీసుకుంటుంటాడు. అయితే ఈయన గతంలో కాఫీ విత్ కరణ్ పేరిట ఓ షో నిర్వహించారు. ఇప్పుడు ఇదే షోకు చెందిన 7వ సీజన్ నడుస్తోంది. అందుకు గాను ఈ షోలో పాల్గొనేందుకు ఇటీవల సమంత ముంబై వెళ్లింది. అయితే కాఫీ విత్ కరణ్ షో అంటేనే బాగా పాపులర్. ఈయన గతంలో పలువురు బాలీవుడ్ తారలను తన షోకు పిలిచి పర్సనల్ విషయాలను కూడా అడిగారు. దీంతో సమంతను కూడా ఆయన అలాగే అడుగుతారని తెలుస్తోంది. అదే జరిగితే సమంత తాను చైతన్యకు విడాకులు ఎందుకు ఇచ్చిందో చెప్పాల్సి వస్తుంది. అయితే దీనికి గాను కరణ్ జోహార్ ప్రశ్న అడగాలి. కానీ ఇలాంటి విషయాలనే ఆయన ఎక్కువగా అడుగుతారు కనుక.. సమంతను తన విడాకుల విషయమై ప్రశ్న అడుగుతారని తెలుస్తోంది. అయితే దీనికి సమంత ఏమని సమాధానం చెబుతుందా.. అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఏదేమైనా ఇప్పుడీ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…