Sai Pallavi : గత కొద్ది రోజులుగా నటి సాయిపల్లవిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న విషయం విదితమే. ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను కొందరు తప్పు పడుతుండగా.. కొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. ఆమె కాశ్మీర్‌లో కాశ్మీర్ పండిట్ల హత్యలు, గోహత్యలు రెండూ ఒకటేనని.. పెద్దగా తేడా ఏమీ లేదని కామెంట్స్ చేసింది. విరాట పర్వం సినిమా రిలీజ్‌కు ముందు ఇలా కామెంట్స్ చేయడంతో ఆమె తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకే ఇలా అని ఉంటుందని.. ఇలాంటి సున్నితమైన అంశాలపై కామెంట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కొందరు ఆమెకు క్లాస్ పీకారు. ఇక కొందరు అయితే ఆమెకు మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండడంతో ఎట్టకేలకు సాయి పల్లవి స్పందించింది. ఈమేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె చెప్పిందంటే..
దేశంలో అనేక హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని.. వాటిని వివరించేందుకు తాను కాశ్మీర్ పండిట్ల హత్యలను, గోహత్యలను రిఫరెన్స్ గా తీసుకున్నానని.. అంతేకానీ.. ఒకరంటే తనకు ద్వేషం లేదని సాయి పల్లవి తెలియజేసింది. అసలు మతం ముఖ్యం కాదని.. హింస ఏ రూపంలో ఏ మతం ద్వారా జరిగినా సమ్మతం కాదని.. దాన్ని మాత్రమే తాను వివరించి చెప్పానని.. అయితే తాను చేసిన అసలు కామెంట్స్‌ను చూపించకుండా కొందరు తన వీడియోను ఎడిట్ చేశారని.. కనుకనే తన కామెంట్స్‌పై వివాదం నెలకొందని సాయిపల్లవి స్పష్టం చేసింది.
అయితే తన వ్యాఖ్యల ద్వారా ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరింది. హింస అనేది పనికిరాదని.. ఏ మతం రూపంలో హింస జరిగినా ఖండించాల్సిందేనని తాను చెప్పదలుచుకున్నానని.. కానీ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చూపించేసరికి వివాదం ఏర్పడిందని.. సాయి పల్లవి తెలియజేసింది. అయితే ఆమె క్షమాపణలు చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తుండగా.. ఎట్టకేలకు ఆమె స్పందించి క్షమాపణలు చెప్పేసింది. మరి ఈ వివాదం ఇక్కడితో అయినా సద్దుమణుగుతుందా.. లేక ఇంకా కొనసాగుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…