Sai Pallavi : సాయిప‌ల్లవిని మీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా చూసి ఉండ‌రు.. పాత వీడియో.. డ్యాన్స్ ఎలా చేసిందంటే..?

Sai Pallavi : న‌టిగా, డ్యాన్సర్‌గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న సాయి ప‌ల్ల‌వి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె న‌టిగానే కాదు.. మంచి వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషిగా అంద‌రిచే ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది. గ‌తంలో ఓ ఫెయిర్‌నెస్ కంపెనీకి చెందిన యాడ్‌లో న‌టించ‌బోన‌ని చెప్పి అంద‌రిచే భేష్ అనిపించుకుంది. ఇక ప్ర‌ముఖ స‌హ‌స్ర అవ‌ధాని గ‌రిక‌పాటి కూడా సాయిప‌ల్లవిని అనేక సార్లు మెచ్చుకున్నారు. హీరోయిన్ అంటే అలా ఉండాల‌ని అన్నారు.

సాయిప‌ల్ల‌వి ఐట‌మ్ సాంగ్స్ చేయ‌బోన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. అలాగే సినిమాల్లో గ్లామ‌ర్ రోల్స్‌ను కూడా చేయ‌న‌ని చెప్పేసింది. అయిన‌ప్ప‌టికీ ఆమె డ్యాన్స్‌, న‌ట‌న‌కు ఆమెకు ఆఫర్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ఎంతో మంది ఫాలోవ‌ర్ల‌ను కూడా సంపాదించుకుంది. ఇక సాయిప‌ల్ల‌వి ఎంబీబీఎస్ చేసింద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆమె జార్జియాలోని బిలిసి స్టేట్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో ఎంబీబీఎస్ చ‌దివింది. అయితే విదేశాల్లో డాక్ట‌ర్ విద్య‌ను చ‌దివిన‌వారు ఇక్క‌డ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్క‌డ ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాన్ని కూడా సాయిప‌ల్ల‌వి రాసి పాస్ అయింది. ఈ క్ర‌మంలోనే ఆమె డాక్ట‌ర్ కూడా అయింది.

Sai Pallavi

అయితే సాయి ప‌ల్ల‌వి ఎంత గొప్ప డ్యాన్స‌రో అంద‌రికీ తెలిసిందే. త‌న సినిమాల్లో ఆమె చేసే డ్యాన్స్‌ను చూసేందుకే చాలా మంది ఆమె మూవీల‌కు వెళ్తుంటారు.. అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. సాయిప‌ల్ల‌వి చేసే డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. శ‌రీరాన్ని ఎటు ప‌డితే అటు విల్లులా వంచుతూ డ్యాన్స్ చేయ‌గ‌ల‌దు. అయితే సాయిప‌ల్ల‌వి జార్జియాలో మెడిసిన్ చ‌దువుతున్న‌ప్పుడు అక్క‌డి యూనివ‌ర్సిటీలో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్‌ను చూస్తుంటే నిజంగా రెండు క‌ళ్లూ చాల‌డం లేదు. అంత‌లా ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ దీన్ని చాలా మంది చూడ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియోను చూసేందుకు నెటిజ‌న్లు సైతం ఆస‌క్తిని కన‌బ‌రుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM