Rishab Shetty : కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదట కన్నడలో రిలీజ్ కాగా అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమాను పలు ఇతర భారతీయ భాషల్లోకి సైతం అనువదించారు. ఈ క్రమంలోనే కాంతారా తెలుగులోనూ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోఈ మూవీని వీక్షించవచ్చు. అయితే కాంతారా హిట్ కావడంతో ప్రేక్షకులు అందరూ రిషబ్ శెట్టి నటించిన ఇతర కన్నడ సినిమాలు ఏంటి.. అని వెదకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన పలు కన్నడ హిట్ సినిమాలు ఏమిటో.. అవి ఏయే ఓటీటీ యాప్‌లలో అందుబాటులో ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రిషబ్ శెట్టి నటించిన బెల్ బాటమ్ మూవీ 2019లో రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో హరిప్రియ, అచ్యుత్ కుమార్, యోగరాజ్ భట్, ప్రమోద్ శెట్టి తదితరులు నటించారు. ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఎంఎక్స్ ప్లేయర్ యాప్‌లో అందుబాటులో ఉంది. అలాగే రిషబ్ శెట్టి నటించిన మరో మూవీ సర్కారీ హిరియ ప్రాథమిక శాలె, కాసరగొడు, కొడుగె కూడా హిట్ అయింది. ఈ మూవీని 2018లో రిలీజ్ చేశారు. 2019లో జాతీయ ఉత్తమ చిన్నారుల సినిమాగా ఈ మూవీకి అవార్డు సైతం లభించింది. ఈ మూవీని జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు.
ఇక రిషబ్ శెట్టి నటించిన మరో కన్నడ మూవీ.. గరుడ గమన రిషబ వాహన జీ5 యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ కూడా చూడదగినదే. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించారు. హరికథె అల్లా గిరికథె పేరిట వచ్చిన మరో రిషబ్ శెట్టి మూవీ కూడా హిట్ మూవీనే. దీన్ని వూట్ యాప్‌లో చూడవచ్చు. అలాగే కథా సంగమ అనే ఇంకో మూవీ కూడా రిషబ్ శెట్టి హిట్ చిత్రాల జాబితాలో ఉంది. దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…