Renu Desai : కోట్ల ఆస్తి తీసుకొని కూడా రేణూ దేశాయ్ పవన్ పై నిందలు వేసిందా.. ఇంతకీ ఎవరు చెప్పేది నిజం..!

October 20, 2022 5:37 PM

Renu Desai : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల అంశం ప్రత్యర్థులకు ఎప్పటి నుంచో ఆయుధంగా ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రత్యర్థులకు ఘాటుగా ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాడు. అవునూ నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను. అలాగే మాజీ భార్యలకు చేయాల్సి న్యాయం చేశానన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ వైఫ్ నందికి రూ. 5 కోట్ల భరణం ఇచ్చాను. రేణూ దేశాయ్ కి మిగిలిన నా ఆస్తి రాసిచ్చాను అన్నారు. నండినికి రూ. 5 కోట్లు చెల్లించినట్లు పవన్ బయటపడ్డాడు.

అది ఓకే కానీ రేణూ విషయంలోనే ఆయన కామెంట్ కరెక్ట్ గా లేదు. 2012లో రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ తన ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నాడు. పవన్ కామెంట్స్ విన్నాక రేణు దేశాయ్ ని తప్పుబట్టాల్సి వస్తుంది. పాపం పవన్ కళ్యాణ్ పై ఆమె అన్యాయంగా ఆరోపణలు చేసినట్లు రుజువవుతుంది. విడాకులు తీసుకున్నందుకు కోట్ల ఆస్తి అప్పగిస్తే.. రేణూ మాత్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది. పవన్ కళ్యాణ్ నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నా స్వశక్తితో పిల్లల పోషణ, చదువు, బాధ్యతలు నెరవేర్చుతున్నాను. నేను 15 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చాను. 19 ఏళ్లకు సొంతగా ఫ్లాట్ కొనుక్కున్నాను. రైటర్, డైరెక్టర్, ఇన్వెస్టర్, డిజైనర్ గా డబ్బులు సంపాదించాను.

Renu Desai sensational comments on pawan kalyan about alimony
Renu Desai

పవన్ కళ్యాణ్ నాకు డబ్బులు ఇచ్చారు, నేను సినిమాలు నిర్మించాను అనేది పుకారు మాత్రమే. నా తెలివితేటలతో నేను అనేక మార్గాల్లో డబ్బులు సంపాధించానని రేణూ దేశాయ్ గతంలో చెప్పారు. ఈ క్రమంలో ఎవరు అబద్దం చెప్పినట్లు? రేణూ దేశాయ్ కి కోట్ల ఆస్తి రాసిచ్చానని పవన్ అబద్దం చెప్పాడా? లేక పవన్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని రేణూ దేశాయ్ అబద్ధం చెప్పిందా..? ప్రస్తుతం పవన్-రేణు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పవన్ కామెంట్ వివాదాస్పదం కాలేదు. లేదంటే పవన్ స్టేట్మెంట్ పై రేణూ దేశాయ్ ఖచ్చితంగా స్పందించేవారు. భవిష్యత్ లో రేణూ దేశాయ్ ఇంటర్వ్యూలో పాల్గొంటే ఆమెకు ఈ ప్రశ్న తప్పకుండా ఎదురయ్యే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now