Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పవన్‌కు విడాకులు ఇచ్చారు. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణుదేశాయ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు (అకీరా నందన్, ఆద్య). పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.
అయితే.. ఇంతకాలం సినిమాలకు దూరమైన రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం అలాగే ఉంది. ఓ మంచి తల్లిగా, పిల్లలను తండ్రికి దగ్గరగా ఉంచుతూ వస్తున్న రేణుదేశాయ్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ఎంతో అభిమానం. ఇక ఇన్నేళ్లపాటు నటనకు, సినిమాలకు దూరంగా ఉన్నా.. రేణుదేశాయ్ బుల్లితెర ప్రోగ్రాంస్, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది. అయితే.. సినిమాల్లోకి రేణుదేశాయ్ రీఎంట్రీ ఎప్పుడు? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలో హేమలత లవణం అనే కీలకపాత్రలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది రేణుదేశాయ్. హేమలత అంటే టైగర్ నాగేశ్వరరావు అక్క. అంటే ఈ మూవీలో రవితేజకు అక్కగా రేణుదేశాయ్ కనిపించనుందన్నమాట. మొత్తానికి రేణుదేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతగా సక్సెస్ అవుతారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…