గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ravi Teja : బాల‌య్య‌కు, ర‌వితేజ‌కు గొడ‌వ‌.. డ్యాష్ గాళ్లు అంటూ.. మాస్ రాజా ఫైర్..

Ravi Teja : నంద‌మూరి బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ అంటూ ఇటు సినిమాలు, అటు డిజిట‌ల్ మీడియా రంగంలోనూ దూసుకుపోతున్నారు. అన్‌స్టాపబుల్ అంటూ టాలీవుడ్ ప్రముఖులతో రచ్చ చేస్తున్న బాలయ్య ఇప్పటికే అయిదు ఎపిసోడ్లు పూర్తి చేశారు. ఇక ఆరో…

Ravi Teja : బాల‌య్య‌కు, ర‌వితేజ‌కు గొడ‌వ‌.. డ్యాష్ గాళ్లు అంటూ.. మాస్ రాజా ఫైర్..

Ravi Teja : నంద‌మూరి బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ అంటూ ఇటు సినిమాలు, అటు డిజిట‌ల్ మీడియా రంగంలోనూ దూసుకుపోతున్నారు. అన్‌స్టాపబుల్ అంటూ టాలీవుడ్ ప్రముఖులతో రచ్చ చేస్తున్న బాలయ్య ఇప్పటికే అయిదు ఎపిసోడ్లు పూర్తి చేశారు. ఇక ఆరో ఎపిసోడ్ సైతం సిద్దం అయింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బాలయ్య సందడి చేయనున్నారు. క్రిస్మస్ నాడు ఈ ఎపిసోడ్ విడుదల కానుంది.

Ravi Teja and balakrishna to appear in unstoppable show

తాజాగా ఎపిసోడ్ 7 ప్రోమో బయటకు వచ్చింది. అందులో బాలయ్యలో కొత్త జోష్ కనిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజతోపాటుగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య ఇంటస్ట్రింగ్ ప్రశ్నలు.. అదే సమయంలో పంచ్ లు వేస్తూ కొత్త ఎనర్జీతో కనిపించారు. ఎపిసోడ్‌ మొదట్లో బాలయ్య మాట్లాడుతూ.. ‘నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందటగా ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వు’ అని అడగ్గా.. దానికి రవితేజ స్పందిస్తూ.. ‘పనీపాట లేని డ్యాష్‌గాల్లకు ఇదే పని’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక రవితేజపై వచ్చిన డ్రగ్స్‌ ఆరోపణలపై కూడా ప్రశ్నించారు బాలయ్య. ‘హెల్త్‌కు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే నీ మీద డ్రగ్స్‌ కేసు పెట్టారు’ అని అడగగా.. రవితేజ బదులిస్తూ.. ‘మొదట నాకే ఆశ్చర్యమేసింది. బాధ ఎక్కడ పడ్డానంటే.. పెంట పెంట చేశారు. అది కొంచెం బాధేసింది’ అని మనసులో మాటను బయటపెట్టాడు రవితేజ. కాగా ఈ ఎపిసోడ్‌ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేలా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి