టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్‌పై అద్భుతంగా నటించి అందరి మనసులు గెలుచుకున్న క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. విజయ్, రష్మికకు సంబంధించిన మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. పూరీ డైరెక్షన్‌లో రానున్న ‘లైగర్’లో నటిస్తున్నాడు. అలాగే రష్మిక.. ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ వంటి చిత్రాలతో టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా ఉంది.
రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం ? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. రష్మిక షేర్ చేసిన పిక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక పిక్ కి “ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్నా.. నేను త్వరలో తిరిగి వస్తాను” అని రాసింది.
రష్మిక పోస్ట్‌తో అందరిలోనూ అనేక అనుమానాలు తలెత్తాయి. కొందరు రష్మిక యునైటెడ్ స్టేట్స్ వెళ్లిందని, అక్కడ పూరీ జగన్నాధ్ “లైగర్” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా యూఎస్ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్న తన సహనటుడు, బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను కలవడానికి వెళ్లి ఉంటుంది.. అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రష్మిక ‘లైగర్’ గెస్ట్ రోల్ లో కనిపించబోతోందా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…