Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్. చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతోపాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఒకప్పుడు యాంకర్ రష్మీ బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌కు గురయ్యేది. ఆమె భాష, వస్త్రధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి.
కానీ క్రమేణా రష్మీ మంచితనం, సేవా కార్యక్రమాలు, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆమెకు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. సోషల్ మీడియాలో రష్మీ చేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంది. అయితే రష్మీ కెరీర్ పరంగా ఎలా ఉన్నాకానీ పర్సనల్ గా చాలా సెన్సిటివ్. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు లేక పడిన బాధలు కావచ్చు రష్మీ మనసును సున్నితంగా మార్చేశాయి. రష్మీ పూర్తి శాకాహారి కనీసం పాలు కూడా తాగదు. ఎందుకంటే పాల కోసం మూగ జీవులను హింసిస్తారని చెప్పి తన వంతుగా పాలకు సంబంధించిన ఏ పదార్థాలను తీసుకోదు.
పూర్తి శాకాహారి.. అంతేకాదు రష్మీ జంతు ప్రేమికురాలు. ఎక్కడైనా సరే జంతువులకు హాని కలిగించారంటే ఆమె అసలు ఊరుకోదు. అయితే తాజాగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం మనుషులుగా పుట్టాం.. కనీసం హెల్ప్ చేయకపోయినా ఫర్లేదు హింసించకూడదు.. ప్రతి మనిషికి మూగజీవాలకి హెల్ప్ చేసేంత స్థోమత ఉండకపోవచ్చు. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా ఫర్లేదు కానీ హింసించకండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రష్మీ పోస్ట్ అందరినీ ఆలోచింపచేస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…