Rashmi Gautam : బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు అప్పట్లో రేటింగ్స్ భీభత్సంగా వచ్చేవి. ప్రేక్షకులు ఈ షోకు బ్రహ్మరథం పట్టారు. ఈ షో ద్వారానే చాలా మంది కమెడియన్లకు సినిమాల్లో బాగా అవకాశాలు వచ్చాయి. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. తరువాత దీనికి కొనసాగింపుగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ అనే షోను ప్రారంభించారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే మొదట్లో జబర్దస్త్‌కు అనసూయ యాంకర్‌గా ఉండగా.. తరువాత రష్మి వచ్చింది. తరువాత జబర్దస్త్ రెండు షోలకు ఓ దశలో రష్మినే యాంకర్‌గా చేసింది. అయితే అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెను మళ్లీ జబర్దస్త్‌కు యాంకర్‌గా చేశారు. ఇక రష్మి యథావిధిగా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు యాంకర్‌గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ రెండు షోలు కళ తప్పాయనే చెప్పవచ్చు.
అప్పట్లో ఈ షోలలో ఉన్న కమెడియన్లు ఇప్పుడు లేరు. జడ్జిలు కూడా మారిపోయారు. సుదీర్ఘకాలం నుంచి కొనసాగిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా ఈ షోకు గుడ్ బై చెప్పేశారు. దీంతో ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే ఎమోషనల్‌గా స్కిట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా చేసిన ఓ స్కిట్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నెల 10వ తేదీన ప్రసారం కానున్న ఎక్‌ట్రా జబర్దస్త్ ప్రోమోను తాజా లాంచ్ చేశారు. ఇందులో రష్మి న్యాయం కావాలని రోడ్డెక్కడం విశేషం.
రష్మి తనకు న్యాయం జరగాలని ధర్నా చేస్తుండగా.. ఫ్లైట్‌లో ఇమ్మాన్యుయెల్ అటు ఇటు కేఏ పాల్ లా తిరుగుతుంటాడు. ఇక రష్మి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటుంది. దీంతో ఇమ్మాన్యుయెల్ కల్పించుకుని.. నేను ముందే చెప్పానా.. ఇలా జరుగుతుందని.. లవ్ సింబల్.. అంటూ వెళ్లిపోతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. ఇలా ఈ ప్రోమో సాగుతుంది. అయితే రష్మి సుధీర్‌పైనే స్కిట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ వేదికపై వారిద్దరి మధ్యే కదా లవ్ ట్రాక్‌ను సృష్టించింది. కనుక సుధీర్ తనకు న్యాయం చేయాలని రష్మి డిమాండ్ చేసిందని స్కిట్ ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇక ఇందులో ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…