Rashmi Gautam : బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న యాంకర్లలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఈ అమ్మడికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో టీవీ షోలతోనే సరిపెట్టుకుంటోంది. అయినప్పటికీ ఆ షోలలో ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా పాపులర్ షో జబర్దస్త్‌లో అయితే సుడిగాలి సుధీర్ తో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ విధంగా రష్మి అందరినీ అలరిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలోనూ ఈమె ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో తనకు చెందిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఇక రష్మికి మూగజీవాలు అంటే చాలా ప్రేమ అన్న విషయం తెలిసిందే.
మూగజీవాల కోసం రష్మి ఎంతో తాపత్రయ పడుతుంది. ఈమెకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఈ విషయం పట్ల రష్మికి చాలా మంది అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఇక కరోనా సమయంలో అయితే వీధి కుక్కలకు ఈమె తిండి పెట్టి ఆదరించింది. ఎన్నో కుక్కల కోసం రెస్‌క్యూ కార్యక్రమాలను చేపట్టింది. ఇక ఎక్కడైనా మూగజీవాలు గాయపడ్డాయనో.. లేదా హింసించబడ్డాయనో తెలిస్తే.. ఈమె తీవ్రంగా విచారిస్తుంది. వాటిని హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే రష్మి ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. అది వైరల్ గా మారింది.
రష్మి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోదు. వాటికి ఆమె ఎల్లప్పుడూ దూరమే. మనం రోజూ తాగే పాలు, తినే పెరుగు, నెయ్యి కోసం మూగజీవాలను డెయిరీలలో చాలా హింసిస్తారని.. అందుకనే తనకు ఆ ఉత్పత్తులు పడవని ఆమె గతంలో ఎప్పుడో చెప్పింది. ఇక మనం రోజూ తాగే పాల కోసం ఆ మూగజీవాలను ఎలా హింసిస్తారో చూడండి.. అంటూ రష్మి పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో గేదెకు పాల కోసం సూదులు గుచ్చడం వంటివి చేస్తున్నారు. ఇది డెయిరీ రంగంలో జరుగుతుందని, కనుక ఇలా చేయవద్దని ఆమె కోరింది. ఇది చాలా దారుణమని.. వాటిని హింసించేందుకు మనం డబ్బులు ఇస్తున్నామని ఆమె పేర్కొంది. ఇలా చేయడం కూడా అత్యాచారం కిందకే వస్తుందని రష్మి తెలియజేసింది. కనుక జంతువులకు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని.. వాటిని హింసించవద్దని ఆమె కోరింది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…