సోషల్‌ మీడియాకి రానా గుడ్‌బై.. పోస్ట్ లన్నీ డిలీట్‌.. కరెక్ట్ గా పెళ్లి రోజే ఎందుకిలా చేశాడు..?

August 19, 2022 2:29 PM

ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఎవరు ఏది చెప్పాల‌నుకున్నా సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటున్నారు. సోషల్‌ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ప్రసార సాధనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఫ్యామిలీ, కెరీర్ విషయాలను షేర్‌ చేసుకోవచ్చు. సామాన్యులు సైతం దీన్ని వాడడం, ఫాలో అవుతున్న సమయంలో రానా దగ్గుబాటి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్నారు.

గత ఐదు రోజు క్రితం సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పోస్ట్ లన్నీ డిలీట్‌ చేశారు. ఫోటోలతో సహా ఇన్‌స్టా మొత్తం డిలీట్‌ చేశారు. కొంతకాలం సోషల్‌ మీడియాకి దూరంగా ఉండాల‌నుకుంటున్నానని, ఇది చాలా ఉత్తమమైన, శక్తివంతమైన నిర్ణయమని, మంచి సినిమాలతో కలుద్దామని చెప్పారు.

rana daggubati deleted instagram account on his marriage day

మీపై అమితమైన ప్రేమతో అని ఇటీవల రానా ట్విట్టర్‌లో పేర్కొన్న విసయం తెలిసిందే. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉంటారా ? ట్విట్టర్‌ కూడా దూరమవుతారా ? అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా.. సినిమాల విషయంలో ఆయన బ్రేక్‌ తీసుకుంటున్నాడా ? లేక వ్యక్తిగతంగా ఏవైనా ఇబ్బందులా ? అనేది ప్రశ్నగా మారింది. రానా రెండేళ్ల క్రితం మ్యారేజ్‌ చేసుకున్నారు. ప్రియురాలు మిహీకా బజాజ్‌ ని ఆయన 2020లో కరోనా సమయంలో మే 20న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆయన, ఆగస్ట్ 8న మ్యారేజ్‌ చేసుకున్నారు.

సోమవారంతోనే వీరి పెళ్లి అయి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి రానా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ లన్నీ డిలీట్‌ చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ మిహీకా ఇద్దరూ కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇటీవల విడుదలైన విరాట పర్వం మూవీకి ఆశించిన ఫలితం రానప్పటికీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment