Ram Charan Watch Price : సెలబ్రిటీలు అంటే సహజంగానే వారు వాడే వస్తువులు ఖరీదు కలిగినవి అయ్యే ఉంటాయి. సినీ ప్రముఖులు వాడే వస్తువుల రేటు అయితే లక్షల్లో ఉంటుంది. కార్లు అయితే కోట్లలో ఖరీదు ఉంటాయి. ఇక వారు వాడే కొన్ని వస్తువుల రేట్లు వింటే వావ్ అంటాం. ఆ వస్తువు వాళ్ళ రేంజ్ ని తెలియజేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో వాడి వాచ్ ఒకటి చాలు నీ లైఫ్ సెటిల్ అయిపోవడానికి.. అని హీరో ఎంత రిచ్చో చెప్పడం గుర్తుందా. అంటే వాచ్ రేటు ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో లక్ష కోట్లకు అధిపతి అయిన పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ఎంత ఖరీదైనదో చెప్పేందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ డైలాగ్ రాశారు. దాదాపు కోటి రూపాయల విలువైన వాచ్ పెట్టుకోడానికి లక్ష కోట్లే ఉండక్కర్లేదు.. రామ్ చరణ్ చాలు అన్నట్లుగా.. టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
అప్పట్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త జివికె మనవరాలు శ్రేయ భోపాల్ పెళ్లి జరిగింది కదా. ఆ పెళ్ళికి తన భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ వచ్చారు. అందరిలానే రెడీ అయివచ్చినా రామ్ మాత్రం అందరి నోట్లో నానారు. దీనికి కారణం ఆయన పెట్టుకొచ్చిన వాచ్ అలాంటిది మరి. ఇండస్ట్రీలో ఖరీదైన వాచ్ లు ధరించేవాళ్ళు చాలామంది వున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి. అందుకే మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ వాచ్ లు కొనేస్తూ తన కలెక్షన్స్ పెంచుకుంటున్నారు. అయితే ఖరీదైన వాచ్ లలో చెర్రీ మిగిలిన హీరోలకు ల్యాండ్ మార్క్ ని సెట్ చేశాడని చెప్పవచ్చు.
ఇక జివికె మనవరాలి పెళ్ళికి రామ్ చరణ్ పెట్టుకొచ్చిన వాచ్ ఖరీదు అక్షరాలా రూ.80 లక్షలు ఉం టుందని టాక్ నడుస్తోంది. పాఠక్ పిలిప్పీ బ్రాండ్ అయిన ఈ వాచ్ ఖరీదు అంతలా ఉంటుంది. ఇప్పటిదాకా పది, ఇరవై లక్షలు వెచ్చించి హీరోలు వాచ్ లు కొంటే చెర్రీ ఏకంగా 80 లక్షల విలువైన వాచ్ పెట్టుకోవడం రామ్ చరణ్ కే సాధ్యమైందని చెప్పవచ్చు. ఎంతలేదన్నా మెగాస్టార్ కొడుకు కదా ఆ మాత్రం ఉండాలిలే మరి అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చరణ్ వాచ్‌కు చెందిన ఈ వార్త ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…