గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mahesh Babu : మ‌హేష్‌తో ఫైట్ చేసేందుకు స్టార్ హీరోని ఎంపిక చేసిన రాజ‌మౌళి..?

Mahesh Babu : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని జనవరి 7న సంక్రాంతికి ఒక…

Mahesh Babu : మ‌హేష్‌తో ఫైట్ చేసేందుకు స్టార్ హీరోని ఎంపిక చేసిన రాజ‌మౌళి..?

Mahesh Babu : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని జనవరి 7న సంక్రాంతికి ఒక వారం ముందుగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప‌నులు పూర్తైన త‌ర్వాత మ‌హేష్‌తో సినిమా చేయ‌నున్నాడు. రాజమౌళి ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

rajamouli picked up villain character for Mahesh Babu film

బాహుబలి కంటే ముందు మహేష్ బాబు, రాజమౌళి వీళ్లిద్దరి కాంబో పట్టాలెక్కాలి. కానీ వీళ్లిద్దరు తమకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఎట్ట‌కేల‌కు ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మహేష్‌ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సమంత ఇప్పటి వరకు మహేష్‌తో కలిసి దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీటిలో బ్రహ్మోత్సవం ఫ్లాప్‌ అయినా.. మిగతా రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇక విల‌న్‌గా త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి