Radhe Shyam : వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌.. రాధే శ్యామ్ నుంచి స్పెష‌ల్ టీజ‌ర్‌..!

February 14, 2022 3:09 PM

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా న‌టించిన తాజా చిత్రం.. రాధే శ్యామ్. ఈ మూవీ ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఫిబ్ర‌వ‌రి 14 వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌త్యేక టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డెల మ‌ధ్య వ‌చ్చిన ప‌లు రొమాంటిక్ సీన్లు ఎంతో క్యూట్‌గా ఉన్నాయి.

Radhe Shyam valentines day special teaser launched
Radhe Shyam

రాధే శ్యామ్ వాలెంటైన్స్ డే స్పెష‌ల్ టీజ‌ర్‌లో పూజా హెగ్డె చివ‌రి సీన్ లో ప్ర‌భాస్‌ను పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. అని అడుగుతుంది. అన్ని మంచి క్వాలిటీలు ఉన్నా.. ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు.. అంటుంది. అందుకు ప్ర‌భాస్ నీళ్లు న‌ములుతాడు.

వాస్త‌వానికి ప్ర‌భాస్‌ను రియ‌ల్ లైఫ్‌లోనూ ఈ ప్ర‌శ్న ఇబ్బందుల‌కు గురిచేస్తుంటుంది. ఆయ‌న మీడియాతో ఎప్పుడు మాట్లాడినా పెళ్లి ప్ర‌స్తావ‌న తెస్తారు. వాటికి ఆయ‌న బ‌దులివ్వ‌రు. ఇక రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ మూవీని మార్చి 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now