గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pushpa Movie : పుష్ప హిందీ వెర్షన్‌ యూట్యూబ్‌లోనా..? ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అల్లు అర్జున్..?

Pushpa Movie : అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం త‌ర్వాత అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు,…

Pushpa Movie : పుష్ప హిందీ వెర్షన్‌ యూట్యూబ్‌లోనా..? ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అల్లు అర్జున్..?

Pushpa Movie : అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం త‌ర్వాత అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే నేరుగా రిలీజ్​ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్లలో విడుదల కాదని అంటున్నారు.

Pushpa Movie  hindi version release troubles allu arjun angry

ఇప్పటికే ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పుష్ప సినిమాను పాన్ ఇండియా సినిమాగా అనుకోకముందుగానే మైత్రీ మూవీస్ సంస్థ హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం విక్రయించేశారు. తీరా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిన తరువాత హిందీ హక్కులు కొనుక్కున్న వ్యక్తి థియేటర్లలో విడుదలకు అంగీకరించడం లేదు.

ఈ విష‌యంలో హీరో బన్నీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో మైత్రీ అధినేతలు హిందీ డబ్బింగ్ కొనుక్కున్న వ్యక్తితో డిస్కషన్లు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని షరతుల మీద హిందీ విడుదలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అలా చేయడం వల్ల ఆదాయం ఎలా ఉంటుందో తెలియ‌దు. కానీ, మైత్రీ మూవీస్ కు అదనపు వ్యయం తప్పదని తెలుస్తొంది.

అయితే డ‌బ్బింగ్ రైట్స్ కొన్న వ్య‌క్తి పబ్లిసిటీ, థియేటర్ ఖర్చులు మైత్రీ మూవీస్ నే పెట్టుకుని, పర్సంటేజ్ ఇస్తే థియేటర్ విడుదలకు అంగీకరిస్తానని అంటున్నారట. లేదూ అంటే అగ్రిమెంట్ ప్రకారం యూ ట్యూబ్ లో విడుదల అవుతుందని చెబుతున్నార‌ట‌. ఈ స‌మ‌స్య ఎలా సాల్వ్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి