Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మొదటి పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిందీ అత్యధిక కలెక్షన్లను వసూలు చేసింది. అయితే మొదటి పార్ట్ మూవీ రిలీజ్ అయి దాదాపుగా 7 నెలలు కావస్తోంది. అయినప్పటికీ ఇంకా రెండో పార్ట్‌పై ఎటూ తేల్చడం లేదు. ఏప్రిల్ నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ మూవీ షూటింగ్‌ను ఆగస్టు నుంచి ప్రారంభిద్దామని గతంలో అనుకున్నారు. కానీ అక్టోబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక మూవీ షూటింగ్ వాయిదా పడడంతో రిలీజ్ తేదీలను కూడా మార్చాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీని 2023 డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి వరకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఇంకో ఏడాదిన్నర వరకు వేచి చూడక తప్పదు. ఇది బన్నీ అభిమానులకు మింగుడ పడని చేదు వార్తగానే చెప్పవచ్చు. వాస్తవానికి ఏప్రిల్ నెలలో షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లేదా 2023 జనవరిలో మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అది అసలు సాధ్యపడడం లేదు. ఇక ఎప్పటికప్పుడు పుష్ప 2 షూటింగ్ తేదీలు దూరం జరుగుతూనే ఉన్నాయి. దీంతో బన్నీ అభిమానులు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక షూటింగ్ మళ్లీ వాయిదా పడడం అలాగే రిలీజ్ తేదీలు కూడా ఇప్పట్లో లేకపోవడం.. వారికి తీవ్రమైన అసంతృప్తిని తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు. దీనిపై అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇక దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథను ఇంకా సిద్ధం చేయలేదని సమాచారం. హిందీ మార్కెట్ లక్ష్యంగా ఆయన కథను రూపొందిస్తున్నారట. దీంతోపాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. కనుకనే షూటింగ్ ఆలస్యం అవుతుందని సమాచారం. ఇక బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతుండగా సుకుమార్ కథను సిద్ధం చేస్తూ మరోవైపు నటీనటుల ఎంపికను చూసుకుంటున్నారు. పుష్ప మొదటి పార్ట్‌కు రూ.150 కోట్లు ఖర్చు కాగా రెండో పార్ట్‌ను రూ.400 కోట్లతో తెరకెక్కించనున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…