Puri Jagannadh : ప్రస్తుత తరుణంలో భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. అది కూడా సినిమా బాగుంటేనే ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఇక చిన్న సినిమాల సంగతి సరే సరి. తొలి రోజు నుంచే ఈ సినిమాలకు పెద్దగా కలెక్షన్లు ఉండవు. మౌత్ పబ్లిసిటీతో ఇవి గట్టెక్కాల్సిందే. అలాంటి క్లిష్టమైన పరిస్థితి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నెలకొంది. కనుకనే నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేసేందుకు భయపడుతున్నారు. అందువల్లే చాలా మంది ఓటీటీనే ఉత్తమమైన మార్గం అని చెప్పి వాటికే తమ సినిమాలను అమ్ముకుంటున్నారు.
ఇక ఎలాంటి సినిమాకు అయినా సరే పబ్లిసిటీ కచ్చితంగా కావాలి. గతంలో రాజమౌళి బాహుబలి తీసినప్పుడు పరిస్థితులు వేరే. అప్పట్లో ఈ మూవీలకు మేకర్స్ ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. అయినా సినిమా హిట్ అయింది. కానీ ఆర్ఆర్ఆర్‌కు మాత్రం రాజమౌళి రూటు మార్చారు. పబ్లిసిటీ చేయకపోతే వర్కవుట్ అయ్యేలా లేదని భావించి తారక్, చరణ్‌లతో దేశంలోని పలు ప్రదేశాలను సుడిగాలిలా చుట్టి వచ్చారు. ఇది బాగానే హెల్ప్ అయింది. అయితే ఇది నేరుగా చేసే పబ్లిసిటీ. అలా కాకుండా నెగెటివ్ పబ్లిసిటీ అని కూడా ఉంటుంది. దీన్ని కేవలం కొందరు మాత్రమే అప్లై చేస్తుంటారు. రిజల్ట్ వస్తే సినిమా హిట్. లేదంటే ఫట్ అన్నట్లు ఈ నెగెటివ్ పబ్లిసిటీ ఉపయోగపడుతుంది. గతంలో కొందరు ఇలాగే తమ సినిమాలకు తామే నెగెటివ్ పబ్లిసిటీ చేసి హిట్ అయ్యేలా చేసుకున్నారు. ఇక తాజాగా పూరీ జగన్నాథ్ కూడా తన లైగర్ మూవీకి అలాగే చేశారనిపిస్తోంది.
దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా లైగర్ మూవీ లోంచి విజయ్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ షాకింగ్‌గా కనిపించాడు. పూర్తి నగ్నంగా కనిపించడంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. అందరూ ఇలాంటి ఫొటోను ఎందుకు షేర్ చేశారు.. అని ఆలోచిస్తున్నారు. అయితే పూరీ మాత్రం ఒక ఉద్దేశంతోనే దీన్ని రిలీజ్ చేశారని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఆశించినట్లే ఇప్పుడీ ఫొటోకు నెగెటివ్ పబ్లిసిటీ బాగా వస్తోంది.
సినిమాలకు నెగెటివ్ పబ్లిసిటీ రావాలంటే.. దానికి చెందిన ఏదైనా అంశంపై విమర్శలు రావాలి. ట్రోల్స్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. విజయ్ ఫొటోపై బాగానే విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇది కూడా సినిమాకు ప్లస్సే అవుతుంది. ఎందుకంటే దీని వల్ల కూడా సినిమాకు ఇన్‌డైరెక్ట్‌గా పబ్లిసిటీ జరుగుతుంది. అసలే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ మూవీ నుంచి అప్‌డేట్ రిలీజ్ అయి కూడా చాలా రోజులే అవుతోంది. కనుక పాజిటివో, నెగెటివో తమ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటే చాలని పూరీ అనుకుని ఉంటారు. కనుకనే ఆయన ఈ రకమైన ఫొటోను రిలీజ్ చేశారని.. టాక్ నడుస్తోంది. అయితే లైగర్ మూవీకి ఇది ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా.. అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…