గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Prakash Raj : మెగా ఫ్యామిలీతో ప్రకాశ్ రాజ్‌కి చెడిందా..? ఇక సోలో ప్ర‌యాణ‌మేనా?

Prakash Raj : మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేస్తున్నట్లు భారీ ప్రచారం సాగింది. కానీ ఈ విషయాన్ని చిరంజీవి అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు సైతం తన…

Prakash Raj : మెగా ఫ్యామిలీతో ప్రకాశ్ రాజ్‌కి చెడిందా..? ఇక సోలో ప్ర‌యాణ‌మేనా?

Prakash Raj : మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేస్తున్నట్లు భారీ ప్రచారం సాగింది. కానీ ఈ విషయాన్ని చిరంజీవి అధికారికంగా ప్రకటించలేదు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు సైతం తన సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు కూడా ఎలాంటి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పలేదు. ఫైనల్ గా మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Prakash Raj might not getting support from mega family

ఆయనతోపాటే ప్యానెల్ సభ్యులు కూడా రాజీనామా చేసి ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ వివాదానికి దారితీసింది. ఈ సమస్యపై సైలెంట్ గా ఉండాలని చిరంజీవి, నాగబాబు ద్వారా ప్రకాష్ రాజ్ కు సందేశం పంపినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో అవసరమైన బ్యాకప్ ఇవ్వకుండా తనను మోసం చేశారని భావించిన ప్రకాష్ రాజ్ నరకం చూపినట్లు తెలిపారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ పోటీ చేయడానికి వీల్లేదు.

అందుకే తన స్టైల్ లో పోరాటం చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అలాగే కోర్టు కేసులు.. వీడియో టేపులు ఇవన్నీ ప్రకాష్ రాజ్ స్ట్రాటజీనే అని అంటున్నారు. ఈ విషయంపై చిరంజీవి, మోహన్ బాబు మాట్లాడారని.. ఎన్నికల అనంతరం తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వివరణ ఇచ్చినట్లు ఓ టాక్ నడుస్తోంది. మరి చిరంజీవి నుండి ఎలాంటి సపోర్ట్ లేని ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబర్స్ ద్వారానైనా సపోర్ట్ అందుకుంటారా లేదా అనేది తెలియాలి. ఫైనల్ గా ప్రకాష్ రాజ్ తన పోరాటాన్ని ఒంటరిగా చేస్తారా.. లేదా ఆగిపోతారా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి