గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Prakash Raj : మోహన్‌బాబు, న‌రేష్‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ దారుణ‌మైన కామెంట్లు.. దుమారం రేపుతున్నాయి..

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల కార‌ణంగా.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు రెండు వ‌ర్గాలుగా విడిపోయిన న‌టీన‌టులు నువ్వెంత అంటే నువ్వెంత‌.. అని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారు. న‌రేష్ అయితే ముండ‌మోపి ఏడుపులు అంటూ ప్ర‌కాష్…

Prakash Raj : మోహన్‌బాబు, న‌రేష్‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ దారుణ‌మైన కామెంట్లు.. దుమారం రేపుతున్నాయి..

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల కార‌ణంగా.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు రెండు వ‌ర్గాలుగా విడిపోయిన న‌టీన‌టులు నువ్వెంత అంటే నువ్వెంత‌.. అని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారు. న‌రేష్ అయితే ముండ‌మోపి ఏడుపులు అంటూ ప్ర‌కాష్ రాజ్ ను, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ను దారుణంగా తిట్టారు. అయితే ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్.. మోహ‌న్ బాబు, న‌రేష్‌ల‌పై దారుణ‌మైన కామెంట్లు చేశారు.

Prakash Raj controversial comments on mohan babu and naresh

మా ఎన్నిక‌ల రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చూపించాల‌నే ఉద్దేశంతో ప్ర‌కాష్ రాజ్‌.. ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్‌కు సీసీటీవీ ఫుటేజ్ కావాల‌ని లేఖ రాశారు. అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. ఫుటేజ్ భ‌ద్రంగానే ఉంద‌ని.. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇస్తామ‌ని తెలిపారు.

అయితే కృష్ణ‌మోహ‌న్‌కు రాసిన లేఖ‌లో ప్ర‌కాష్ రాజ్‌.. మోహ‌న్‌బాబు, న‌రేష్‌ల‌ను అసాంఘిక శ‌క్తులు అని అన్నారు. వారు ఎన్నిక‌ల రోజు అసాంఘిక శ‌క్తుల్లా ప్ర‌వ‌ర్తించార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో ప్ర‌కాష్ రాజ్ వారిపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అయితే ఇందుకు మోహ‌న్ బాబు, న‌రేష్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి