Prabhas : ప్ర‌భాస్ సినిమా అప్‌డేట్‌.. స్పిరిట్ మూవీలో క‌రీనా క‌పూర్‌..?

October 14, 2021 9:48 AM

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్ప‌టికే ప‌లు ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చేస్తున్న సినిమాల‌ను ఇంకా పూర్తి చేయ‌లేదు, అయిన‌ప్ప‌టికీ త‌న మ‌రో మూవీని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న 25వ సినిమాను స్పిరిట్ పేరిట తెర‌కెక్కిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ ప‌క్క‌న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Prabhas spirit movie kareena shown interest in script

క‌రీనా క‌పూర్ ప్ర‌స్తుతం అమీర్‌ఖాన్ న‌టిస్తున్న లాల్ సింగ్ చ‌డ్డా మూవీలో చేస్తోంది. ఇందులో క‌రీనా లుక్ అద్భుతంగా ఉండ‌నుంది. కాగా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ స్క్రిప్ట్‌తో క‌రీనాను సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. ఇందుకు క‌రీనా క‌పూర్ కూడా ఆస‌క్తి చూపించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా క‌రీనా క‌పూర్ భ‌ర్త సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ మూవీలో ప్ర‌భాస్‌కు వ్య‌తిరేకంగా రావ‌ణుడి పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న పార్ట్ షూటింగ్ ఇటీవ‌లే పూర్తి చేసుకుని కేక్ క‌ట్ చేసి చిత్ర యూనిట్‌కు వీడ్కోలు ప‌లికారు. ఇక ప్ర‌భాస్ ఇటీవ‌లే క‌రీనా క‌పూర్‌కు హైద‌రాబాదీ బిర్యానీని పంపించారు. దీంతో ఆమె వాటి తాలూకు ఫోటోల‌ను త‌న సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేసింది.

బాలీవుడ్ వ‌ర్గాల ద్వారా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్‌కు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే స్పిరిట్ మూవీలో క‌రీనా న‌టిస్తుందా, లేదా ? అనే విష‌యంపై ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త రాలేదు. కానీ త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment