Prabhas : ఆ పెద్దింటికి అల్లుడు కాబోతున్న ప్రభాస్..?

December 2, 2021 11:58 AM

Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు పొందినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అనే విషయానికి వస్తే అందులో కూడా ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రభాస్ సినిమాల విషయంలో ప్రేక్షకులను ఆనందపరచినా.. పెళ్లి విషయంలో మాత్రం అభిమానులను తీవ్ర నిరాశ పరిచారని చెప్పవచ్చు.

Prabhas reportedly may marriage very soon that family girl

ఇప్పటికే ఈయన పెళ్లి గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే బాహుబలి చిత్రం తర్వాత ఈయన క్రేజ్ పెరగడంతో పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను వెంటనే పూర్తి చేసి పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త వినబడుతోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే విషయానికి వస్తే.. ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న ఓ గొప్పింటి అమ్మాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రభాస్ పెద్దింటి అల్లుడు కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కాస్త సంబర పడినా ఈ విషయంలో నిజం ఎంత ఉంది.. అంటూ సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ప్రభాస్ లేదా కృష్ణంరాజు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now