Prabhas : ప్ర‌భాస్ జీవితం అంతే.. ఇక బాగుప‌డ‌దు.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

April 2, 2022 10:44 PM

Prabhas : ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి చాలా మందికి తెలుసు. ఈయ‌న చెప్పింది చెప్పిన‌ట్లు జ‌రుగుతుంద‌నే పేరుంది. గ‌తంలో ఈయ‌న ఎంతో మందికి జ్యోతిష్యం చెప్పారు. ఆయ‌న చెప్పిన‌వి చెప్పిన‌ట్లు జ‌రిగాయి. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటార‌ని చెప్పాడు. అది జ‌రిగిపోయింది. జ‌గ‌న్ సీఎం అవుతాడ‌ని చెప్పారు. అది కూడా జ‌రిగింది. ఇలా ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ నిజ‌మే అయ్యాయి. అయితే తాజాగా ఈయ‌న ప్ర‌భాస్ జాతకంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Prabhas life will be miserable says astrologist Venu Swamy
Prabhas

ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌టించిన రాధేశ్యామ్ మూవీ ఫ్లాప్ అయిన విష‌యం విదిత‌మే. అయితే ప్ర‌భాస్ జీవితంలో ఆయ‌న న‌టించ‌నున్న‌ ఇంకా ఎన్నో సినిమాలు ఇలాగే ఫ్లాప్ అవుతాయ‌ని..ఆయన‌ జీవితం ఇక అంతేన‌ని.. బాగుప‌డ‌ద‌ని.. అందువ‌ల్ల ప్ర‌భాస్ తో సినిమా తీయాలంటే నిర్మాత‌లు ఒక‌టి రెండు సార్లు ఆలోచించుకోవాల‌ని.. అన్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

అయితే దీనిపై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. కానీ ఇంకో వైపు కొంద‌రు ఫ్యాన్స్ మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ఎందుకంటే.. గ‌తంలో వేణు స్వామి చెప్పిన‌వి అన్నీ నిజ‌మే అయ్యాయి. అందువ‌ల్ల ప్ర‌భాస్ విష‌యంలో ఆయ‌న చెబుతున్న జ్యోతిష్యం కూడా నిజ‌మే అవుతుంద‌ని.. ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికి ఆయన చెప్పింది జ్యోతిష్య‌మే అయినా.. అస‌లు భ‌విష్య‌త్తు అనేది మ‌న ముందుకు వ‌స్తేనే క‌దా.. అస‌లు ఏం జ‌రుగుతుందో తెలిసేది. మ‌రి ప్ర‌భాస్ భ‌విష్య‌త్తు ఎలా ఉందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now