Prabhas : నా మృతికి రాధేశ్యామ్ డైరెక్ట‌ర్ కార‌ణం అంటూ.. ప్ర‌భాస్ ఫ్యాన్ సూసైడ్ లెట‌ర్..

November 12, 2021 8:02 PM

Prabhas : అభిమానులందు వీరాభిమానులు వేర‌యా అనే చెప్పాలి. తాజాగా ప్ర‌భాస్ అభిమాని రాధేశ్యామ్ అప్‌డేట్స్ ఇవ్వ‌డం లేద‌ని సూసైడ్ నోట్ రాశాడు. ప్ర‌స్తుతం ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల‌లోకి వెళితే.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Prabhas  fan wrote a letter about radhe shyam director

రాధేశ్యామ్ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం రెగ్యులర్‌గా రావడం లేదు. ప్రభాస్ బర్త్ డేకు టీజర్ వదిలారు. ఆ తర్వాత మరో అప్‌డేట్ లేదు.

ఈ విష‌యం ప్ర‌భాస్ అభిమానుల‌ని చాలా నిరుత్సాహ‌ప‌ర‌చింది. ఈ క్ర‌మంలోనే ఓ డై హార్డ్ ఫ్యాన్ వినూత్నంగా నిరసన తెలిపాడు. యూవీ క్రియేషన్స్ తీరుతో విసిగిపోయి.. ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాశాడు. తన చావుకు యూవీ క్రియేషన్స్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కారణం అని లేఖలో పేర్కొన్నాడు. రాధే శ్యామ్ అప్‌డేట్స్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూశాం. ఇంకా అప్‌డేట్స్‌ వస్తాయి అనుకుంటే, అది జరగడం లేదు. కనీసం నా చావుతో అయినా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అంటూ సూసైడ్ నోట్ లో తన మనోభావాలు వెల్లడించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment