గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Prabhas : ఫ్యాన్ హెయిర్ స్టైల్ చూసి మురిసిపోయిన ప్ర‌భాస్.. గిఫ్ట్ ఇచ్చి సంతోషింప‌జేశాడు..

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆయ‌న చేస్తున్న చిత్రాల‌లో రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇటీవల ప్రభాస్ సినిమా రాధే శ్యామ్…

Prabhas : ఫ్యాన్ హెయిర్ స్టైల్ చూసి మురిసిపోయిన ప్ర‌భాస్.. గిఫ్ట్ ఇచ్చి సంతోషింప‌జేశాడు..

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆయ‌న చేస్తున్న చిత్రాల‌లో రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇటీవల ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ పాట ఆలస్యం అయినప్పుడు.. ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేయని సమయంలో అభిమానులు ఏ రేంజ్ లో యూవీ క్రియేషన్స్ ను ట్రోల్ చేశారో తెలిసిందే.

Prabhas fan surprised him with his hair style got gift

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సినిమాల‌పై అంద‌రిలోనూ అమితాస‌క్తి నెల‌కొంది. అంతేకాదు ప్ర‌భాస్‌పై త‌మ ప్రేమ‌ను తెలియ‌జేసేందుకు వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ని ఓ వీరాభిమాని కలిశాడు. అతడు తన తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా జుట్టు కట్ చేసుకున్నాడు. అది చూసి ప్రభాస్ నవ్వుకున్నాడు. అతడి అభిమానానికి ముచ్చటేసిన ప్రభాస్ కొద్ది సమయం పక్కన కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడాడు.

ఆ వీరాభిమానికి ఖరీదైన వాచ్ ను కూడా బహుమానంగా ప్రభాస్ అందజేశాడు. ప్రస్తుతం ఆ వీరాభిమాని ఫొటో, ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ వాచ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ మంచి మనసు మరోసారి ఇలా నిరూపితం అయ్యింది.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవ‌ల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తి చేయ‌గా, వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్‌లో ఆ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి