Pooja Hegde : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నందితా శ్వేత, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో తాజాగా పూజా హెగ్డే పాల్గొంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటింది. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరినట్లు తెలిపారు. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పూజా హెగ్డేకు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను.. అని జోగినపల్లి సంతోష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. అందులో ‘ప్రేరణ’ అనే పాత్రలో అభిమానులను అలరించనుంది. ఇక ఆచార్య, బీస్ట్ అనే చిత్రాలతోపాటు పలు హిందీ చిత్రాలలోనూ పూజా నటిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…