Pooja Hegde : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హిట్ అయ్యాక ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనుక వేసుకోవాలనే కాన్సెప్ట్ ని బాగా ఫాలో అవుతున్పారు. ఈ కేటగిరీలోకి మన బుట్టబొమ్మ కూడా చేరింది. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ ని అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించేస్తూ బిజీగా మారింది.
వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటించేస్తుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా వస్తున్న బీస్ట్ అనే సినిమాలో పూజా హెగ్దే తీసుకున్న రెమ్యూనరేషన్ విషయంలో పూజా హెగ్దే పేరు మార్మోగిపోతోంది. తన బాడీగార్డ్స్, అసిస్టెంట్స్, తన చార్టెట్ ఫ్లైట్ కోసం ఇలా అన్ని రకాలుగా తన పర్సనల్ ఖర్చులు నిర్మాతల మీదనే వేస్తుందంటూ ఆర్కే సెల్వమణి మండిపడ్డారు.
అలాగే టాలీవుడ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కూడా పూజా డిమాండ్స్ కి తట్టుకోలేక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు తోడుగా మీడియాలో హైలెట్ అవ్వడంతో పూజా హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్దే ఒక్క హిట్ తో ఇంత యాటిట్యూడ్ చూపిస్తుందా అంటూ సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
అలాగే అడ్వర్టైజ్ మెంట్స్ కి నెలకు ఆదాయం రూ.50 లక్షలకు పైగా సంపాదిస్తోంది. ముంబై బాంద్రా లాంటి కాస్ట్లీ ఏరియాలో కొన్ని కోట్లు పెట్టి మరీ 3 బెడ్ రూమ్ ఫ్లామ్ కొనేసింది. ఏది ఏమైనా ఈ బ్యూటీ సంపాదన దాదాపుగా రూ. 50 కోట్ల నుండి రూ.70 కోట్లు ఉంటుందని.. ఇది కేవలం ఆమె సినీ ఇండస్ట్రీ నుండి వచ్చింది మాత్రమే అని తెలుస్తోంది. మరి బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్ చేసిందనేది ఇంకా తెలీదు. ప్రస్తుతం పూజా హెగ్దే నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…