NTR Samantha : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఇక పోతే ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసి తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సమంత అతిథిగా వచ్చారు. షోలో సమంత ఎంతో చాకచక్యంగా ఆడుతూ 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.
ఈ ఆటలో భాగంగా సమంత, ఎన్టీఆర్ లు ఎంతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా సమంత మాట్లాడుతూ.. ఎవరు మీలో కోటీశ్వరులు తదుపరి సీజన్‌కు మీకు బదులుగా నేను హోస్ట్ చేయవచ్చా ? అని సమంత ఎన్‌టీఆర్‌ను అడిగింది. దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యారు.
ఇక ఎన్టీఆర్.. ఇదే విషయాన్ని డిక్లేర్ చేయమంటారా.. అని కంప్యూటర్‌ని అడగడంతో.. అందుకు సమంత స్పందిస్తూ.. మీ ఫ్యాన్స్ కు మాత్రం చెప్పకండి.. అంటూ దండం పెడుతుంది. నా ఫ్యాన్స్ బంగారాలు అంటూ ఎన్టీఆర్ అభిమానులను పొగుడుతారు. ఇలా సమంత ఎంతో సరదాగా ఆడుతూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పాతిక లక్షలు గెలుచుకొని వాటిని ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళం అందించింది. అయితేె ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సమంత తదుపరి సీజన్‌కు హోస్ట్‌గా వస్తుందా ? అందుకనే ఈ విధంగా చేశారా ? అన్నది ఇప్పటికైతే సందేహమే. తరువాత ఏం జరుగుతుందో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…