Pooja Hegde : తెలుగు సినీ ప్రేక్షకులకు పూజా హెగ్డె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం, నటనతో ఎంతో మంది అభిమానం చూరగొంది. అలాగే డ్యాన్స్ చేయడంలోనూ పూజా హెగ్డె పెట్టింది పేరు. కనుకనే ఆమెకు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఫిట్ నెస్ విషయంలోనూ ఈమె ఎంతో జాగ్రత్త వహిస్తుంది. ఈమె అందం గురించి ఎంత చెప్పినా అదిఆ తక్కువే అవుతుంది. ఈమెను అందరూ పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు. అలాగే అభిమానులు బుట్టబొమ్మ అని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఆమె అందం, డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతుంటారు.
పూజా హెగ్డె తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈమె తెలుగులో 2014లో వచ్చిన ఒక లైలా కోసం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అందులో నాగచైతన్య హీరోగా నటించారు. తరువాత ఆమెకు అనేక సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. స్టార్ నటులతో ఈమె యాక్ట్ చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠ పురములో చేయగా, మహేష్ తో కలసి మహర్షి చేసింది. అలాగే ప్రభాస్ తో రాధే శ్యామ్ చేసింది. రామ్ చరణ్‌తో ఆచార్యలోనూ తళుక్కుమంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డె సోషల్ మీడియాలోనూ తన డ్యాన్స్ వీడియోలతో అదరగొడుతోంది. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
పూజా హెగ్డె తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొనగా.. ఆమె డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు షాకవుతున్నారు. ఆమె రాములో రాముల, బుట్టబొమ్మ, సీటీమార్ తదితర పాటలకు డ్యాన్స్ చేసి అలరించింది. ఈమె సినిమాలో కూడా ఈ విధంగా చేయలేదని అంటున్నారు. ఒక సందర్భంలో అయితే ఈమె ఏకంగా 10 నిమిషాల పాటు డ్యాన్స్ చేసి అలరించింది. కాగా ఈమె డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని నెటిజన్లు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…