Pethanna : పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తో రాబోతున్న పెద్దన్న..!

October 24, 2021 6:09 PM

Pethanna : సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తె’. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘పెద్దన్న’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ‘అన్నాత్తె’ సినిమా తెలుగు రైట్స్‌ను ఏషియన్‌ ఇన్‌ ఫ్రా ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ శనివారం విడుదలైంది. వెంకటేష్ చేతుల మీదుగా టీజ‌ర్ ను విడుదల చేశారు.

Pethanna teaser launched by venkatesh

ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్‌లో ప్రేక్షకులకు కావలసినంత యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉందని చెప్పవచ్చు. ఇందులో రజనీ చెప్పే డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఈ సినిమాలో నయనతార, సీనియర్ నటి కుష్బూ, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి సీనియర్ నటీనటులు కూడా కీలకపాత్రలను పోషించారు. ఈ సినిమాకు డి.ఇమ్మాన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరింత హైలెట్ అయిందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా 4వ తేదీన విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment