Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌.. అన్నా లెజినీవా ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. నోరెళ్ల‌బెడ‌తారు..!

October 21, 2022 4:25 PM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ని అంద‌రూ అంటున్నార‌ని.. అయితే విడాకులు ఇచ్చాకే పెళ్లి చేసుకున్నాన‌ని.. త‌న మొద‌టి, రెండో భార్య‌ల‌కు ఆస్తుల‌ను, డ‌బ్బును ఇచ్చాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ టాపిక్ మ‌ళ్లీ తెర మీద‌కు వ‌చ్చింది. అయితే ప‌వ‌న్ మూడో భార్య అయిన అన్నా లెజినీవా ఆస్తుల వివ‌రాలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ల్యాణ్ ర‌ష్యా దేశ‌స్థురాలు అన్నా లెజినీవాను ప్రేమ‌వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

తీన్మార్ సినిమాలో అన్నా లెజినీవా న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. అనంత‌రం అన్నా లెజినీవాను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా లెజినీవా ప్ర‌ముఖ రష్య‌న్ మోడ‌ల్, న‌టి కాగా అనేక తెలుగు సినిమాల‌లో కూడా న‌టించారు.

Pawan Kalyan wife Anna Lezhneva assets value you will be surprised
Pawan Kalyan

అన్నా లెజినీవా1980 సంవ‌త్స‌రం ఆగ‌స్టు 3న జ‌న్మించారు. ఇక ఎక‌నామిక్ టైమ్స్ ప్ర‌కారం అన్నా లెజినీవా ఆస్తుల విలువ రూ.1800 కోట్లుగా ఉంది. అంతే కాకుండా అన్నా లెజినీవా క్రిస్టియ‌న్ మ‌తానికి చెందిన‌వారు. మొద‌టిసారిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నా లెజినీవాల‌కు 2011లో ప‌రిచ‌యం ఏర్పడింది. తీన్మార్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా ఒక‌రితో మ‌రొక‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. త‌రువాత మూడేళ్ల పాటు వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక 2013లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు పేరు పొలేనా, కుమారుడు మార్క్ శంక‌ర్ లు ఉన్నారు. ఇక గ‌తంలో అన్నా లెజినీవా మోడ‌ల్, న‌టి అయిన‌ప్ప‌టికీ ఆమె సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

అధికారికంగా ఆమెకు అస‌లు సోష‌ల్ మీడియా ఖాతాలు కూడా లేక‌పోవ‌డం విశేషం. మ‌రోవైపు అన్నా లెజినీవా ప్ర‌స్తుతం ఎక్కువ‌గా ర‌ష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అన్నా లెజినీవా పిల్ల‌లు ఇద్ద‌రినీ సింగ‌పూర్ లో చ‌దివించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్టు వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై స‌మాచారం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment