Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్‌కు చెందిన తాజా చిత్రం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. ఆయన వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు నటులు ఆయన చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలపగా.. ఏపీకి చెందిన మంత్రులతోపాటు మరికొందరు సెలబ్రిటీలు పవన్‌ను విమర్శించారు. ఆయన అలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అయితే ఇదే విషయంపై నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా స్పందించారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆయన ప్రశ్నలకు ఆయనే సమాధానాలు చెప్పుకుంటారని అన్నారు. పవన్ ప్రశ్నించడంలో తప్పేమీ లేదని, కానీ ఆయన అన్నమాటలకు ఆధారాలు చూపాలని అన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడిన భాష సరిగ్గా లేదని పోసాని కృష్ణమురళి అన్నారు. చిరంజీవి ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడలేదని, ఆయనతో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఏపీ సీఎం, మంత్రులను పవన్ తిట్టడం సరికాదని అన్నారు.
రెండు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ తిరిగారని, ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. సీఎం జగన్‌కు, పవన్‌కు పోలిక లేదని, సీఎం జగన్ పనితీరును దేశ మొత్తం గుర్తించిందని కొనియాడారు. రెండేళ్లలోనే ఏపీలో పాఠశాలల రూపురేఖలను జగన్ మార్చారని, అనేక సంక్షేమ పథకాలను జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ అంటే ఏమిటో అందరికీ తెలుసని, ఆయనకు, జగన్‌కు పోలికే లేదన్నారు. చంద్రబాబును పవన్ ఎప్పుడైనా ప్రశ్నించారా ? అని పోసాని అన్నారు. కాగా పోసాని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…