గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pawan Kalyan Venkatesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో త్రివిక్ర‌మ్ మ‌ల్టీ స్టార‌ర్‌..?

Pawan Kalyan Venkatesh : టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ క్రేజ్ న‌డుస్తోంది. స్టార్ హీరోలు కూడా ఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌డంతో అనేక మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో…

Pawan Kalyan Venkatesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో త్రివిక్ర‌మ్ మ‌ల్టీ స్టార‌ర్‌..?

Pawan Kalyan Venkatesh : టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ క్రేజ్ న‌డుస్తోంది. స్టార్ హీరోలు కూడా ఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌డంతో అనేక మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం రూపొంద‌నుంద‌నే టాక్ న‌డుస్తోంది. త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లతో చాలా సాన్నిహిత్యం ఉంది.

Pawan Kalyan Venkatesh multi starrer combo in trivikram direction

ఇప్పుడు త్రివిక్రమ్.. పవన్, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విష‌యంపై త్రివిక్ర‌మ్.. ప‌వ‌న్‌, వెంకటేష్‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపించాడ‌ట‌. వారిద్దరూ ఈ చిత్రం చేసేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. గ‌తంలో ప‌వ‌న్ – వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గోపాల గోపాల చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు తాజా మ‌ల్టీ స్టార‌ర్‌పై ఆస‌క్తి నెల‌కొని ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన పవన్.. ఇప్పుడు రీమేక్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్.. మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాట‌లు అందిస్తున్నారు. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్.. మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి