గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pawan Kalyan : మంచు విష్ణుకు ముఖ్య‌మైన విష‌యం చెప్పిన ప‌వ‌న్‌ కళ్యాణ్..!

Pawan Kalyan : మా ఎన్నిక‌ల త‌ర్వాత మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మ‌ధ్య దూరం పెరిగింద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ – విష్ణు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారని వార్తలు…

Pawan Kalyan : మంచు విష్ణుకు ముఖ్య‌మైన విష‌యం చెప్పిన ప‌వ‌న్‌ కళ్యాణ్..!

Pawan Kalyan : మా ఎన్నిక‌ల త‌ర్వాత మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మ‌ధ్య దూరం పెరిగింద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ – విష్ణు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కెమెరా వెనుక ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని చెప్పుకొచ్చింది.

Pawan Kalyan told important thing to manchu vishnu

ఇక తాజాగా మంచు విష్ణు కూడా ఈ విష‌యంపై ప్ర‌స్తావించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో తాను, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నామని చెప్పారు. పవన్‌తో ఏం మాట్లాడాన‌నే విషయం తనకు తెలుసన్నారు. ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో విష్ణు.. అని పవన్ తనకు చెప్పారని విష్ణు వెల్లడించారు. అక్కడ భారత ఉపరాష్ట్రపతి ఉన్నారు. ప్రోటోకాల్ ప్ర‌కారం సినిమా ఫంక్ష‌న్ లో మాదిరిగా మేం మాట్లాడుకోలేం క‌దా.. అని అన్నాడు.

చిరంజీవి – మోహన్ బాబు ఎన్నికల అనంతరం ఫోన్‌లో మాట్లాడుకున్నారని మంచు విష్ణు తెలిపారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఒక జర్నలిస్ట్ ఒక డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యారని.. ఆ జర్నలిస్ట్ వల్లే ‘మా’ లో వివాదాలు మొదలయ్యాయని విష్ణు కామెంట్ చేశారు. ఇక ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్ సభ్యుల రాజీనామాలపై ఫస్ట్ టైమ్ స్పందించారు ‘మా’ అధ్యక్షుడు విష్ణు. అసలా మ్యాటర్ తన దాకా రాలేదని స్పష్టం చేశారు. అయితే ఆ రాజీనామా లేఖ‌లు త్వ‌ర‌లోనే అందుతాయ‌ని.. రీసెంట్‌గా ప్రకాశ్‌రాజ్ చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి